తెలుగు సినిమాలు ఒకప్పుడు కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం అయి ఉండేవి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, RRR వంటి సినిమాలు ఎంతటి క్రేజ్ ని తీసుకొచ్చాయో అందరికీ తెలిందే. ముఖ్యంగా RRR చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. మరోవైపు దర్శకుడు రాజమౌళి తరువాత చిత్రం మహేష్ బాబుతో ప్రపంచ వ్యాప్తంగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.
Also Read : రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తున్న అల్లు స్నేహ… దారుణంగా ట్రోలింగ్!
Advertisement
సాధారణంగా తెలుగు మూవీస్ డైరెక్టర్లు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టారనే విషయాన్ని మనం చాలా సార్లు విన్నాం. కొన్ని సందర్భాల్లో అవి ట్రోలింగ్ కి కూడా గురయ్యాయి. కానీ మన టాలీవుడ్ మూవీని హాలీవుడ్ వారు కాపీ చేశారనే విషయాన్ని మీరు నమ్మగలరా ? ముఖ్యంగా ఆ టాలీవుడ్ దర్శకుడు ఎంత గొప్పవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ దర్శకుడు మరెవ్వరో కాదండోయ్ చంద్రశేఖర్ యేలెటి. ఈయన గోపిచంద్ హీరోగా ఒక్కడున్నాడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో విలన్ ఆల్మోస్ట్ చనిపోయేవిధంగా కనిపిస్తాడు. అతను బ్రతకాలి అంటే రేర్ బ్లడ్ గ్రూపు ఉన్న వారు కావాలి. అదే బాంబే బ్లడ్ గ్రూపు.
Advertisement
ఆ రేర్ బ్లడ్ గ్రూపు హీరో గోపిచంద్ కు మాత్రమే ఉంటుంది. బ్లడ్ కదా ఇచ్చేస్తా పోలే అంటారా ? ఇక్కడ చాలా ట్విస్ట్ లుంటాయి. అవి అన్ని తెలియాలంటే మాత్రం ఒక్కడున్నాడు చిత్రం చూడాల్సిందే. ఈ సినిమా కాన్సెప్ట్ తోనే ‘GET THE GRING’ అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి అడ్రియన్ గ్రున్ బెర్గ్ దర్శకత్వం వహించాడు. పలువురు హాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ సినిమాని టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఒక్కడున్నాడు చిత్రం నుంచి కాపీ చేశారంటే ఎవ్వరూ నమ్మరు. కానీ అక్షరాల సత్యం. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం గోపిచంద్ నటించిన ఒక్కడున్నాడు చిత్రాన్ని ఒకసారి వీక్షించి.. అదేవిధంగా హాలీవుడ్ కి చెందిన ‘GET THE GRING’ మూవీని కంపెర్ చేస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది.
Also Read : ఇలాంటి వారితో అమ్మాయిలు చాట్ చేశారంటే… అంతే సంగతులు !