చైనాలో మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతోంది కరోనా వైరస్. కరోనా వైరస్ కు జన్మనిచ్చిన దేశంలోనే మరోసారి వైరస్ వర్రీ అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే, కరోనా వ్యాప్తికి మూలమైన చైనా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ దేశ రాజధాని బీజింగ్ లో పురుగుల వర్షం కురిసింది. నిలిచి ఉన్న పలు కార్లతో పాటు రోడ్డుపై వర్షంతో పాటు పురుగులు కూడా పడ్డాయి. దీంతో పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగించారు.
read also : Sir Movie : సార్ మూవీ ఓటింగ్ డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement
ఈ వీడియో క్లిప్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతో పాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే పురుగుల వర్షానికి కారణం ఏమిటి అన్నది తెలియలేదని పేర్కొంది. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతో పాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ తెలిపినట్లు చెప్పింది.
Advertisement
READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్
తుఫాను తర్వాత వీచే భారీ గాలుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆ జర్నల్ పేర్కొన్నట్లు వివరించింది. కాగా, చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ను ఇన్ సైడ్ పేపర్ శనివారం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్టు అందులో పేర్కొంది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు చైనా జర్నలిస్ట్ షేన్ షివే దీనిని ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురియలేదని చెప్పారు.
READ ALSO : రాజమౌళిని డైరెక్టర్ గా కాకుండా హీరో చేయాలని అనుకున్నారా? దీని వెనుక ఉంది ఎవరు?