Home » ఇంత ఘోరమైన పిచ్ లు… పరువు తీసిన బీసీసీఐ… షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఐసీసీ..!

ఇంత ఘోరమైన పిచ్ లు… పరువు తీసిన బీసీసీఐ… షాకింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఐసీసీ..!

by Sravya
Ad

క్రికెట్ మ్యాచ్ గెలుపు పిచ్ మీద కూడా ఆధారపడి ఉంటుందని అంత అంటూ ఉంటారు క్రికెట్ అంటే ప్లేయర్ల గురించి ఇది వరకు వారి బలాలు, బలహీనతల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు పిచ్ ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదివరకు ఎక్కువగా పిచ్ గురించి మాట్లాడుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కువగా దీని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఏ దేశంలో మ్యాచ్ జరిగితే ఆ దేశం ప్లేయర్ల కోసం పిచ్ లు తయారవుతున్నాయి. హోమ్ అడ్వాంటేజ్ అని గెలుపుల కోసం పిచ్ తయారు చేస్తున్నారు.

Advertisement

ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్లు మూడు రోజుల్లోనే ముగిసిపోవడానికి కారణం ఇది కూడా. ఇండియాలో కనుక మ్యాచ్ జరిగితే స్పిన్ కి అనుకూలంగా, ఆస్ట్రేలియాలో కనుక జరిగితే పేస్ కి అనుకూలంగా ఉంటున్నాయి. సరైన పిచ్ చూసి ఏళ్ళు దాటిపోయింది. బై లెటర్లు మ్యాచ్లకి ఇలా తయారు చేసి ఉంటే సర్లే అనుకోవచ్చు కానీ వరల్డ్ కప్ లకు కూడా ఇలానే తయారు చేస్తున్నారని… ఇదేమి బాలేదని సాక్షాత్తు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చెప్పింది.

Advertisement

సాధారణంగా పిచ్ లపై ఐసీసీ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. వరల్డ్ కప్ మ్యాచ్ పై తాజాగా రేటింగ్ ఇచ్చింది మొత్తం 11 మ్యాచ్లు యావరేజ్ పిచ్ పై నిలిచాయి. ఇందులో ఐదు ఇండియా ఆడినవే ఉన్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ సెమీఫైనల్ మ్యాచ్ లు కూడా యావరేజ్ పిచ్ ల మీద జరిగాయి. ఇండియా ఆడిన 11 మ్యాచ్లో ఐదు యావరేజ్ మ్యాచ్ లని ఐసిసి రేట్ చేయగా అందులో రెండు అహ్మదాబాద్ లో ఆడినవి ఉన్నాయి. అయితే అహ్మదాబాద్ స్టేడియం చాలా పెద్దది ఇక్కడ పిచ్ విషయంలో పొరపాటు జరగడంతో అభిమానులు నిరాశకి గురవుతున్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading