Home » శివున్ని కాళికాదేవి కాళ్లతో తొక్కడం వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఏంటో చూడండి..!!

శివున్ని కాళికాదేవి కాళ్లతో తొక్కడం వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఏంటో చూడండి..!!

Ad

మనం చాలా సందర్భాలలో శివుడు కాళికామాత కాళ్ళకింద ఉండడం చూసే ఉంటాం. కానీ అది ఎందుకు అనేది మనలో చాలామందికి తెలియదు. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్వం రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈయన బ్రహ్మదేవుడికి తపస్సుచేసి ఒక వరం పొందుతాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడితే వెయ్యిమంది రక్తబీజులు మళ్లీ పుట్టేటట్లు వరం పొందుతాడు. ఈ వర ప్రభావం వల్ల అతను రోజురోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు.

మునులు, సాధువులు, సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొర పెట్టుకుంటారు. త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సాయం కోరుతారు. దుర్గామాత తన అంశ అయిన కాళికా రూపంలో రక్తబీజుడితో యుద్ధం చేయడానికి వెళుతుంది. కాళిమాత ఒక్కసారి రక్తబీజుడు సంహరిస్తే అతని రక్తం భూమి మీద పడి 1000 మంది పుడతారు. కాళీమాత అత్యంత క్రోధంతో పుట్టిన ప్రతి ఒక్కరిని సంహరిస్తూ పోతుంది. ఇలా ఎన్నిసార్లు చంపినా పుడుతూ ఉండడంతో కాళీ మాత కోపం తారాస్థాయికి చేరుతుంది.

Advertisement

Advertisement

అప్పుడు కాళీమాత తన చేతిలో ఒక పాత్రను ధరించి సంహారించిన ప్రతి రక్తబీజుని శరీరంలో ఉద్భవించిన మొత్తం రక్తాన్ని పీల్చేస్తుంది. ఆ విధంగా రక్తబీజుని రక్తం నేలపై పడకుండా మొత్తం అందరిని సంహరిస్తుంది. కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. కాళీమాతను ఉగ్రరూపం నుండి ఎవరూ సాధారణ స్థితికి తీసుకు రాలేకపోతారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి శివుడిని ప్రార్ధిస్తారు. శివుడు కూడా ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్దమవుతాయి.

తనను సాధారణ స్థితికి తీసుకురావడం కేవలం స్పర్శతోనే సాధ్యమని భావిస్తాడు శివుడు. అందుకోసం కాళీమాత వెళ్తున్న మార్గమధ్యంలో తను పడుకుంటాడు. అది గ్రహించకుండా కాళీ మాత శివుడి పై ఒక అడుగు పెడుతుంది. పాదాల కింద ఉన్న శివుని స్పర్శతో వెంటనే తేరుకొని తన సాధారణ రూపానికి వస్తుంది. తన భర్త అయిన శివున్ని తన పాదంతో తన్నినందుకు కాళీ మాత ఎంతగానో దుక్కిస్తుంది. అప్పుడు శివుడు మనం ఏం చేసినా అది సకల ప్రాణకోటి కల్యాణానికే అని చెప్పి ఓదారుస్తాడు.

ALSO READ;

చాణక్యనీతి : ఈ విషయాలు సీక్రెట్ గా ఉంచకపోతే సమస్యలు తప్పవట..!

ఈ 5 రాశుల వారికి అన్నీ మంచి ఫలితాలే.. అనుకున్నది సాధిస్తారు..!!

 

Visitors Are Also Reading