భారతీయ సంప్రదాయం ప్రకారం చీర అనేది స్త్రీ యొక్క హుందాతనానికి ప్రతిరూపం.. అందుకే ఏదైనా పెద్ద పెద్ద కార్యాలు చేసినప్పుడు చీరను తప్పనిసరిగా కట్టుకుంటారు. అందుకే సినీ కవులు చీర పై ఒక మంచి పాట కూడా రాశారు. “చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో” అంటూ చీర గొప్పతనాన్ని వివరించారు. అలా మన భారతీయ సాంప్రదాయమైన చీరకట్టు విదేశాల్లో కూడా చాలామంది ఇష్టపడుతున్నారు.. అయితే ఇప్పటివరకు చీర కట్టనివారు, అలాగే కట్టుకునేవారు.. చీర కొనేటప్పుడు మరియు ధరించేటప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..
also read:
Advertisement
క్లాత్ మెటీరియల్ ఎంపిక :
మీరు చీరకట్టులో ఉత్తమంగా కనిపించాలంటే జార్జెంట్, షిపన్ వంటి వాటితో తయారు చేసిన వాటిని మానుకోండి. కంచి, ధర్మవరం, టస్సర్, బనారస్ వంటి చేనేత చీర ఎంచుకోవాలి. దీనివల్ల మీ నడుము కింద అందమైన రూపం కనిపిస్తుంది.
సరైన కలర్ ఎంచుకోండి :
మన శరీర కలర్ ను బట్టి మనం చీరను కూడా ఎంచుకోవాలి. పసుపు, ఎరుపు, నారింజ,ఉదా వంటి షేడ్స్ ఉన్న చీరను పెంచుకుంటే మీరు చాలా అందంగా కనిపిస్తారు.
బోర్డర్ పై దృష్టి పెట్టండి :
చీరలకు ఉండేటువంటి ప్రింట్లు మరియు బార్డర్ లో ఉన్న వాటిని ధరిస్తే మీరు అందంగా కనిపిస్తారు. అలాగే ముత్యాలు,అలంకారాలు నూలు, ఎంబ్రాయిడరీ మొదలైనవి ప్రదర్శించటం మంచిది.
Advertisement
బ్లౌజ్ ఎంపిక:
బ్లౌజ్ ని ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చీరని ఏ కలర్ లో అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా సెట్ అయ్యే బ్లౌజులు ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. ప్రస్తుత కాలంలో చీరతోపాటు బ్లౌజులు వస్తున్నాయి.
లోదుస్తుల ఎంపిక :
మీరు స్లిమ్ గా ఆకర్షణగా కనిపించాలంటే షిప్ కట్ లెహంగాను యూస్ చేయాలి. భారీ మెటీరియల్ తో తయారు చేసిన లోదుస్తులను ఎంచుకోవడం మంచిది.
also read: