ఒకప్పుడు ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి తమలోని పాండిత్యాన్ని మొత్తం బయటకు తీసి ప్రేమలేఖలు రాయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు అడుగు ముందుకేసి ప్రేమలేఖలను రక్తంతో రాస్తే, మరికొందరు ప్రియురాలిని పొగడ్తలతో ముంచేత్తుతూ లేఖలు రాస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఇంటిని శుభ్రం చేస్తున్న భార్యకు 18 ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమలేఖ దొరికింది.
READ ALSO : ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి
Advertisement
దీంతో చివరకు ఆమె ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ప్రేమలేఖకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఓ మహిళ అతని ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పాడైపోయిన వస్తువులన్నింటినీ బయటకు పడేస్తుండగా ఆమెకు ఓ లేఖ కనిపించింది. అది 18 ఏళ్ల క్రితం తన భర్త రాసిన ప్రేమ లేఖ అని తెలిసింది. అందులో తన భర్త ప్రేమను వ్యక్తం చేస్తూనే ప్రియురాలికి ల్యాబ్ ప్రయోగాల గురించి, డ్రాయింగ్ ద్వారా వివరిస్తూ రాసకొచ్చారు.
Advertisement
READ ALSO : Aparichithudu : న్యూస్ పేపర్ చూసి.. అపరిచితుడు సినిమా తీశారా ?
ప్రేమను తెలియజేయడమే కాకుండా చదువుకు సంబంధించిన అనేక విషయాలను కూడా వివరించడం ఆమెను ఆకట్టుకుంది. ప్రియురాలికి ఇలాంటి ప్రేమలేఖలు రాసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని, సదరు మహిళ పేర్కొంది. వెంటనే ఆ ప్రేమలేఖను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి ప్రేమికుడు చాలా అరుదుగా ఉంటారని, కొందరు ప్రేమలేఖలో ల్యాబ్ పాటలు సూపర్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
READ ALSO : Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?