Home » కుమారుడి కోసం 62 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఫోటోలు వైరల్..!

కుమారుడి కోసం 62 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఫోటోలు వైరల్..!

by Anji
Ad

తల్లి అధిక బరువు పెరగడంతో తనకు ఏమవుతుందో అని కొడుకు పెట్టిన కన్నీళ్లు ఆ తల్లిలో మార్పును తీసుకొచ్చింది. గుర్తు పట్టలేనంతగా ఆమె మారిపోయింది.  సోషల్ మీడియాలో ఓ తల్లి విజయవంతమైన ప్రయత్నం గురించి జోరుగా చర్చ నడుస్తోంది.  అంటే మనం అర్థం చేసుకోవచ్చు.  ఒకప్పుడు 114 కేజీల బరువు ఉన్న ఆమె ఏకంగా 62 కేజీలు తగ్గింది. అంత బరువు తగ్గడానికి కూడా ఒక కారణం కొడుక్కి తన మీద ఉన్న అమితమైన ప్రేమ.. అది బయటపడేలా చేసిన ఓ చేదు అనుభవం అనే చెప్పాలి. 

Advertisement

అమెరికాలో వాషింగ్టన్ కు చెందిన సారా లాకెట్ అనే మహిళ 114 కిలోబరువు ఉండేది. ఓ రోజు కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. కొడుకుతో పాటు స్లైడ్ లోకి వెళ్లగా మలుపు తిరుగుతున్న సమయంలో ఆమె స్లైడ్ లో ఇరుక్కుపోయింది. తల్లిన చూసిన కొడుకు కంగారు పడిపోయాడు. ఆమె ఏమైందో అని కన్నీరు పెట్టుకున్నాడు. చివరికీ ఆమె భర్త వచ్చి తనను బయటికి తీశాడు. అయితే కొడుకు ముందు అలా జరగడం సారాకు ఇబ్బందిగా అనిపించింది. 

Manam News

స్లైడ్ లో చిక్కుకోవడానికి తన బరువే కారణం అని బాధపడింది. కొడుకు ముందు అవమానం జరిగిందంటూ భావించి..అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. కేవలం తన డైట్ మార్చి, వర్కౌట్ల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న నిర్థారణ అయింది. బరువు తగ్గాలని ఆమె ఆశయాన్ని కష్టతరం చేసింది. దీంతో తన లైఫ్ స్టైల్, డైట్ ని పూర్తిగా మార్చుకుంది. వైద్యుల సలహా తీసుకొని.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. వర్కౌట్స్, పోషక విలువలు కలిగిన డైట్ కంటిన్యూ చేసింది. 

Advertisement

Also Read :  ఈ ఫోటోలో ఉన్న పాపని గుర్తుపట్టారా..తెలుగు స్టార్ హీరో తల్లి..!!

Manam News

రోజుకి 3వేల క్యాలరీల బర్న్ చేయడం ప్రారంభించింది. అల్పాహారంగా టొమాటొ, బచ్చలికూర, గుడ్డులోని తెల్లసొన, భోజనంలో కొద్దిగా రైస్, ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలను మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంది. దీని ఫలితంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె 53 కేజీల బరువుతో మాత్రమే ఉంది. వాస్తవానికి ఆమె తొలుత అంతబరువుగా ఉండేది కాదట. కానీ ప్రెగ్నేన్సీ సమయంలో ఆమెకి జరిగిన సర్జరీల కారణంగా బరువు పెరిగిపోయిందట. మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో 26 కేజీలు, మూడో బిడ్డ వరకు 133 కేజీలకు వచ్చినట్టు చెప్పింది. ఇక ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. చివరికీ ఊహించని విధంగా ట్రాన్స్ ఫార్మింగ్ చెందారు. బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ గా మారాయి. అసలు ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read :  మీరు గోడ పక్కన ఫ్రిజ్ ఉంచారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Visitors Are Also Reading