Telugu News » Blog » భార్య తన భర్తని ఇలా ప్రేమగా చేసుకుంటే మరొకరి వైపు అస్సలు వెళ్లరట..!

భార్య తన భర్తని ఇలా ప్రేమగా చేసుకుంటే మరొకరి వైపు అస్సలు వెళ్లరట..!

by AJAY
Ads

ప్ర‌స్తుత కాలంలో అక్ర‌మ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అంతే కాకుండా ఆ సంబంధాల వ‌ల్ల నేరాల రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. అయితే చాలా జంట‌ల్లో భార్య‌లు బాధ్య‌త‌గా కుటుంబాల‌ను చూసుకుంటున్నారు కానీ పురుషులు మాత్రం ప‌రాయి స్త్రీల మోజులో ప‌డి సంసారాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఒకద‌గ్గ‌ర ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి.

Advertisement

అయితే భ‌ర్తలు ప‌రాయి స్త్రీల జోలికి వెళ్ల‌కుండా ఉండాలంటే భార్య‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. భార్య త‌న భ‌ర్త‌ను ప్రేమ‌గా చూసుకుంటే ప‌రాయి స్త్రీల‌తో సంబంధాలు పెట్టుకోకుండా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. కొంత మంది భార్య‌లు భ‌ర్త‌ల‌తో త‌రచూ గొడ‌వ‌లు పెట్టుకుంటారు.

Advertisement

అలాంటి వారి భ‌ర్త‌లు భార్య‌ల‌పై విర‌క్తి పెంచుకుని చివ‌రికి ప‌రాయి స్త్రీల వ‌ద్ద ప్రేమ‌ను వెతుక్కునే ప్ర‌య‌త్నం చేస్తార‌ట‌. అంతే కాకుండా కొంత మంది భార్య‌లు సీరియ‌ల్స్ లేదంటే సినిమాలు చూస్తూ భ‌ర్త‌ల‌ను గాలికి వ‌దిలేస్తారు. భ‌ర్త‌కు భోజనం పెట్ట‌డం కానీ తిన్నారా అని అడ‌గ‌టం లాంటివి కానీ చేయ‌రు. దాంతో భ‌ర్త‌ల‌కు భార్య‌పై ప్రేమ త‌గ్గిపోతుంద‌ట‌. ఆ త‌ర‌వాత ఇత‌ర స్త్రీల‌తో సంబంధాలు పెట్టుకునేందుకు ఆస‌క్తి చూపిస్తార‌ట‌.

Advertisement

భ‌ర్త ఇంటికి రాగానే ప్రేమ‌గా ప‌ల‌క‌రించి భోజ‌నం పెట్టే భార్య‌ల‌కు భ‌ర్త‌లు కూడా గౌర‌వం ఇస్తార‌ట‌. త‌మ పై భార్య చూపిస్తున్న ప్రేమ‌ను చూసి త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కుండా బుద్దిగా ఉండాల‌ని అనుకుంటార‌ట‌. అయితే కొంత‌మంది భ‌ర్త‌లు మాత్రం త‌మ‌కు గ‌తంలో ఏమైనా రిలేష‌న్ షిప్స్ ఉంటే వాటిని కొన‌సాగిస్తూ ఉంటారు. అలాంటి వారిని కూర్చోబెట్టి రిలేష‌న్ షిప్స్ ను విడిచిపెట్టాల‌ని ప్రేమ‌గా చెప్పాల‌ట‌.