Home » అదృష్టం అంటే ఇదే.. ఒక షేరుతో రూ. 50లక్షల లాభం..!

అదృష్టం అంటే ఇదే.. ఒక షేరుతో రూ. 50లక్షల లాభం..!

by Anji
Ad

సాధారణంగా లక్షకు రూ.2లక్షవస్తేనే వావ్ అనుకుంటాం మనం. రూ.5లక్షలు లాభం వస్తే అబ్బా అనుకుంటాం. అలాంటిది ఏకంగా రూ.లక్షకు రూ.50లక్షల లాభం వస్తే ఇక సంతోషానికి అవధులుండవు. ఇలా జరుగుతుందా..? అని మీరు అనుకోవచ్చు. ఇలాంటివి స్టాక్ మార్కెట్ తరచూ జరుగుతూనే ఉంటాయి. భారీ లాభాలు వస్తుంటాయి. అదేవిధంగా భారీ నష్టాలు కూడా వస్తుంటాయి. మార్కెట్ లో అన్ని షేర్లు ఇలాంటి ప్రాఫిట్ ని అందించలేవు. కానీ కొన్ని స్టాక్ మాత్రం అదిరిపోయే రిటర్న్ అందిస్తాయి. వీటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అని చెబుతుంటారు. 

Advertisement

మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో కైజర్ కొర్పరేషన్ షేరు భారీ లాభాలను అందించింది. ఎంతలా అంటే.. రూ.1లక్షను రూ.50లక్షలుగా మార్చేసేంతలా.. బీఎస్ఈ లిస్టెడ్ స్మాల్ క్యాప్ స్టాక్ 2021 నవంబర్ నెలలో రూ.1వద్ద ట్రేడ్ అయ్యేది. కైజర్ కార్పొరేషన్ షేరు ధర రూ.52 వద్ద ఉంది. ఏడాదిలోనే స్టాక్ ధర ఏకంగా 5వేల శాతానికి పైగా పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.275 కోట్లు ఆరు నెలల కాలంలో చూసినట్టయితే.. మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. వారం రోజులుగా చూసినట్టయితే షేరు ధర రూ.3.5 శాతం మేర వరకు క్షీణించింది. అదేవిధంగా గత నెలలో చూస్తే ఈ స్టాక్ ధర 9 శాతం వరకు పడిపోయింది. 

Advertisement

Also Read :  Telugu Memes and Trolls on VEERA SIMHA REDDY MOVIE : వీర సింహ రెడ్డి ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మిమ్స్

ఆరు నెలల కాలంలో చూసినట్టయితే.. షేరు ధర రూ.98 నుంచి రూ.52కి దిగి వచ్చింది. 2022లో ఈ స్మాల్ క్యాప్ షేరు రూ.3.5 నుంచి రూ.55కి చేరింది. అనగా రూ.2,100 శాతంపైకి కదిలింది. జనవరి 06న స్టాక్ ధర రూ.52 వద్ద క్లోజ్ అయింది. నెల రోజుల కిందట ఈ స్టాక్ లో రూ.లక్ష పెట్టిన వారికి ఇప్పుడు రూ.22లక్షలు వచ్చేవి. 2021 నవంబర్ నెలలో ఈ స్టాక్ లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ.52 లక్షలు లభించేవి. ఈ షేరు 52 వారాల కనిస్ట స్థాయి రూ.3.21గా ఉంది. అదేవిధంగా 52 వారాల గరిష్ట స్థాయి రూ.130.55గా నమోదైంది. 

Also Read :  ఉసిరి మిఠాయితో ఆ వ్యాధులన్ని మటుమాయం..! 

Visitors Are Also Reading