Home » శేఖర్ మాస్టర్ కూతురు హీరోయిన్ అవ్వనుందా.. ఆ క్వాలిటీస్ ఉన్నా హీరో కోసం వెతుకుతున్నారా..?

శేఖర్ మాస్టర్ కూతురు హీరోయిన్ అవ్వనుందా.. ఆ క్వాలిటీస్ ఉన్నా హీరో కోసం వెతుకుతున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ అంటే గుర్తుకు వచ్చేది ప్రభుదేవా మాత్రమే.. కానీ కొంతకాలం తర్వాత శేఖర్ మాస్టర్ అరంగేట్రం జరిగింది.. ఇక తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ అంటే శేఖర్ మాస్టర్.. శేఖర్ మాస్టర్ అంటే డాన్స్ అనే విధంగా తయారయింది.. డాన్స్ మాస్టర్ గా కొనసాగుతూ మరోవైపు ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నారు ఆయన. ఈటీవీ లో ప్రసారమయ్యే డీ షో లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ ఢీ షోకే జడ్జి గా ఎదిగారు.. ఇలా అనేక బుల్లితెర షోలలో జడ్జి గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో అయినా శేఖర్ మాస్టర్ డాన్స్ కావాలని కోరుకునే విధంగా ఎదిగారు అంటే ఆయన పర్ఫామెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవైపు డాన్స్, కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.. ఆయనకు ఇద్దరు పిల్లలు సాహితీ, విన్ని లతో కలిసి ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు.. అయితే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. అలాగే ఆమె కొన్ని డాన్సులు కూడా చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ, బుల్లితెర షో లలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ వస్తోంది..

Advertisement

ఎంతో అందంగా చక్కగా కుందనపు బొమ్మలా ఉన్న శేఖర్ మాస్టర్ కూతురు సాహితీకి హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అందం ఉంది.. అయితే ఈ మధ్య కాలంలో సాహితీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఒక కొత్త దర్శకుడు శేఖర్ మాస్టర్ ను కలిసి కథ కూడా చెప్పారని, శేఖర్ మాస్టర్ కూడా ఓకే చేశారని, సినిమాలో హీరో కోసం ఇండస్ట్రీలో ఒక యంగ్ టాలెంట్ హీరో కోసం శేఖర్ మాస్టర్ దగ్గరుండి సెర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి దీనిపై శేఖర్ మాస్టర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ముందు ముందు తెలుస్తుంది.

ALSO READ:

Visitors Are Also Reading