Home » రజనీకాంత్ ఒక్కరోజు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా..?

రజనీకాంత్ ఒక్కరోజు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. వయసు పెరుగుతున్నా కొద్దీ యువ హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీస్తూ పోతున్నారు. సినిమాలు ప్లాప్ అవుతున్నా సరే తగ్గడం లేదని చెప్పవచ్చు. ఆ మధ్య కాస్త ఇబ్బంది పడినట్లు కనబడినా మళ్లీ స్పీడ్ పెంచేసి సినిమాలను చేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు కూడా సంతకం చేసి ఉన్నారు.

Advertisement

త్వరలో మరో సినిమా కూడా రజనీకాంత్ సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా జైలర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి గతంలో ఎప్పుడు లేని విధంగా రజనీకాంత్ చాలా సమయం తీసుకుంటున్నారు. ఇక రజనీకాంత్ పాత్రకి కూడా భాష రేంజ్ లో ఉంటుందని,దర్శకుడు అలా డిజైన్ చేశాడని తమిళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక జైలర్ సినిమా కోసం ఏకంగా ఆయన 140 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇక మరో సినిమా లాల్ సలాం.

Advertisement

ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రజినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఆయనను ఏడు రోజుల డేట్స్ అడిగారు. దీనికిగాను ఏకంగా రజనీకాంత్ 25 కోట్లు అడిగినా నిర్మాణ సంస్థ ఓకే అని చెప్పిందట. 25 కోట్లు అంటే రోజుకు 3.5 కోట్ల పారితోషికం రజనీకాంత్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading