Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటా..ప్రో. కోదండరాం..!!

ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటా..ప్రో. కోదండరాం..!!

by Sravanthi Pandrala Pandrala

తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పార్టీలలో వలసల పర్వం కొనసాగుతోంది. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ ఇంకోవైపు బిజెపి ఎవరికి వారే ప్రచార యాత్రలో తిరుగుతూ ప్రజల్లోకి వెళుతూ బిజీగా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తాము అంటూ భీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎవరితో పొత్తు ఉండదని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటుంది, బిజెపి కూడా తప్పకుండా అధికారం మాదే అంటూ గట్టిగా చెబుతోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 115 సీట్లు తక్కువగా కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నొక్కి చెబుతోంది.

Ad

ఇలా ఎవరికి వారే రాజకీయ సమీకరణాలు సెట్ చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఈ తరుణంలోని తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. అదేంటో చూద్దాం.. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని పెట్టడం మనందరికీ తెలుసు.. గత ఎన్నికలలోనే కాంగ్రెస్ టిడిపి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ఆయన ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు.

కానీ ఈసారి కోదండరాం చాలా ముందస్తుగా ప్లాన్ చేస్తున్నారు.సూర్యాపేటలో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల కోరికలు తీర్చేందుకు ఏ పార్టీలో చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని అన్నారు. అవసరమైతే పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే విషయానికి వస్తే కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Visitors Are Also Reading