సాధారణంగా స్వర్గం, నరకాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. కానీ చనిపోయిన తరువాత ఆత్మ అనేది ఒకటి ఉంటుందని.. అది ఎక్కడికి వెళ్తుందో మాత్రం తెలియదు. ఆకాశంలో దేవుళ్లుంటారని రంభ, ఊర్వశి, మేనక అంటూ కథకథలుగా చెబుతుంటారు. కొన్ని పురాణాలు, ఇతివృత్తాల ఆధారంగా మన చావును బ్రహ్మ దేవుడు ఫిక్స్ చేస్తాడని.. చావు వచ్చే సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయిన.. యముడు ప్రాణాలను హరిస్తాడని రకరకాలుా పేర్కొంటుంటారు. అదేవిధంగా పునర్జన్మలు కూడా ఉంటాయని నమ్ముతుంటారు. కానీ ఓ వ్యక్తి మరణించిన తరువాత బతికి రావడం అనేది కల.
Advertisement
కొన్ని సంఘటనలు మనలను మిరాకిల్స్ చేస్తుంటాయి. అలాంటి సంఘటనే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి దహన సంస్కారాలు చేపట్టేందుకు సిద్ధం అవుతుండా.. లేచి కూర్చున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ లోని మోరెనాలోని శాంతిధామ్ కి చెందిన జీతూ ప్రజాపతి అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతను పడిపోవడాన్ని చూసిన స్థానికులు శ్వాస ఆడడం లేదని గుర్తించారు. వెంటనే అతను చనిపోయాడని నిర్ధారించారు.
Advertisement
బంధువులు, కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగు వారు శాంతి థామ్ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏడుపులు, పెడబొబ్బల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఇంతలోనే ఒక్కసారి గా ప్రజా పతి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇక ఆ తరువాత తేరుకు వారు వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించారు. మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఆశ్చర్యకరమైన పరిణామంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతికి వచ్చాడంటూ.. ఇదో మిరాకిల్ అంటూ మాట్లాడుకుంటుండగా.. అతను డీప్ స్లీప్ కి వెళ్లి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
అమెరికాలో కొత్త వైరస్ కలకలం.. దీని లక్షణాలు ఇవే..!
హీరో నాగార్జునకు యాంకర్ అనసూయకి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి మీకు తెలుసా..?
త్వరలో కెవ్వు కార్తీక్ పెళ్లి….అమ్మాయి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!