Home » పెళ్ళికి ముందే స్టార్స్ ను భార్యాభర్తలు చేసేసిన వికీపీడియా

పెళ్ళికి ముందే స్టార్స్ ను భార్యాభర్తలు చేసేసిన వికీపీడియా

by Bunty
Ad

వికీపీడియా అనగానే గుర్తొచ్చేది సెలెబ్రిటీల బయో డేటా చూపించే వెబ్ సైట్. గూగుల్ లో ఏ సెలెబ్రిటీ గురించి తెలుసుకోవాలన్నా ఈ వికీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ వికీపీడియా పెళ్లితో ఒక్కటి కాబోతున్న ఓ జంట కారణంగా హైలెట్ అయ్యింది.

Advertisement

Kat And Vicky’s Wedding

Kat And Vicky’s Wedding

Advertisement

బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి రాయల్ స్టైల్ లో చాలా గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి సంబరాలు మొదలైపోగా బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు కత్రినా విక్కీ పెళ్లికి బయల్దేరి వెళ్లారు. మరి కొంతమంది ఈ రోజు బయల్దేరారు. ఈ జంట పెళ్లికి దేశవ్యాప్తంగా ఉన్న విఐపిలు, వివిఐపిలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న డంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయాల్లో కత్రినా, విక్కీ పెళ్లి కూడా ఉండడం విశేషం. నిన్న ఈ లవ్ బర్డ్స్ హల్దీ వేడుక, అలాగే సంగీత్ కూడా ఘనంగా జరిగాయి అని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే సెలబ్రిటీల బయోగ్రఫీ చూపించే వికీపీడియా ఈ స్టార్ కపుల్ కు ముందుగానే పెళ్లి చేసేసింది. ఈ జంట పెళ్లి డిసెంబర్ 9న జరగబోతోంది. కత్రినా, విక్కీ కౌశల్ ఇద్దరూ కలిసి ఏడు అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉంటామంటూ అగ్నిసాక్షిగా ఒకరికొకరు ప్రమాణం చేసుకోబోతున్నారు. అయితే వికీపీడియా మాత్రం ఇద్దరు బాలీవుడ్ ప్రముఖుల పేజీలను పెళ్లికి ముందే అప్డేట్ చేసింది. వారిద్దరు భార్యాభర్తలుగా ప్రకటించేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

Visitors Are Also Reading