Home » ఆ షోలోనే తన వైఫ్ కాళ్ళు పట్టిన జబర్దస్త్ కమెడియన్.. ఎందుకో తెలిస్తే షాక్..?

ఆ షోలోనే తన వైఫ్ కాళ్ళు పట్టిన జబర్దస్త్ కమెడియన్.. ఎందుకో తెలిస్తే షాక్..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో షోలు చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. ఇందులో చాలా విజయవంతంగా దూసుకుపోతున్న షో క్యాష్.. ఇందులో యాంకర్ సుమ సందడి మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ కాగా కొమరం తన భార్య రజితతో, ఆనంద్ తన వైఫ్ మంజులతో, శాంతికుమార్ తనవైఫ్ సుమతో, సత్తిపండు తన వైఫ్ నాగమాంబతో కలిసి ఈ షోకు హాజరయ్యారు. ఈ షో ప్రోమో లో సుమను నాగమాంబ వదినా అని పిలిస్తే సత్తిపండేమో థాంక్యూ అక్కా అంటూ సుమ పరువు తీశాడు.

ఈ సందర్భంలో సుమ నాగమాంబను 100 కోట్లు ఇచ్చి కొనమంటే కొనేస్తారా అని అడగగా అబ్బో మా ఆయన సత్తిపండు బంగారం నేను ఇవ్వను అని ఆమె చెబుతుంది. దీంతో వెంటనే ఆనంద్ బంగారం అంతా నీ మీద వేసుకొని మీ ఆయన బంగారం అంటావేంటి అన్నాడు. రజిత మీకు 200 కోట్లు ఇస్తా మీ ఆయన ను అమ్మేస్తావా అంటే అబ్బో నేను కూడా అమ్మను అని చెబుతోంది. ఆరేళ్ల క్రితం అయితే అమ్మే దాన్ని అని కొమరం చెప్పగా, మళ్లీ ఆరేళ్ల తర్వాత అమ్మేస్తుందని ఆనంద్ కామెంట్ చేసాడు. దీంతో యాంకర్ సుమ శాంతి కుమార్ వైఫ్ సుమను అలాంటి ఆలోచనలు నీకు వచ్చాయా అని అడగగా వచ్చాయండి కానీ కొనేవాళ్ళు ముందుకు రాలేదని శాంతి కుమార్ అనేశారు.

దీని తర్వాత కొమరం తన వైఫ్ ను వీపు గోకాలనీ అడగగా ఆమె భర్త చెప్పిన విధంగా వీపు గోకుతుంది. అలాగే కొమరం కాళ్లు ఒత్తాలని కోరగా తన భార్య అతను చెప్పిన విధంగానే చేస్తుంది. వివాహమై 13 ఏండ్లు అయిందని కానీ సుమక్క పుణ్యమా అని నా భార్య కాళ్ళు నొక్కిందని కొమరం చెప్పుకొచ్చాడు. ఈ తరుణంలోనే ఆనంద్ కూడా తన భార్యను కాళ్లు పట్టాలని కోరగా ఆమె చాలా కోపంగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దీని తర్వాత ఆనంద్ తన వైఫ్ మంజుల ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు పడతాడు.. అయితే సత్తిపండు తన యొక్క వైఫ్ ను ఎస్కలేటర్ నుండి దూకాలని కోరగా మీరు ముందు దూకి చూపించండి అని అతడి భార్య చెబుతుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

ఎన్టీఆర్ గారి కంటే ముందు రాజకీయాల్లో చక్రం తిప్పిన తోలి తెలుగు సినీ నటుడి గురించి ఈ విషయాలు తెలుసా ?

ఆ హీరో అంటే జక్కన్నకు ఎందుకంత ఇష్టం..!!

 

Visitors Are Also Reading