పెళ్లి తర్వాత భార్యాభర్తలు సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ భార్య భర్తలు చూసే ఈ తప్పుల వలన వైవాహిక జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం విడిపోవడం విడాకులు తీసుకోవడం ఇటువంటివి ఎక్కువగా చూస్తున్నాము. అయితే భార్యాభర్తలు చేసే ఈ పొరపాట్ల వలన వాళ్ళ వైవాహిక జీవితం పాడైపోతుంది. చాలామంది భార్యాభర్తల్లో కమ్యూనికేషన్ సమస్య ఎక్కువగా ఉంటోంది. దీని వలన ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కుదరదు. ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకోలేకపోతుంటారు. ఆఖరికి విడిపోవడమే మేలని విడాకుల వరకు వెళ్తుంటారు.
Advertisement
Also read:
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించాలి. ఒకరి మాటల్ని ఒకరు గౌరవించాలి. ఒకరికొకరు ప్రాధాన్యతను ఇవ్వాలి. అలానే వైవాహిక జీవితంలో భాగస్వామ్య యొక్క ఆధిపత్యం కొనసాగించడం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ కారణంగా భార్య లేదా భర్త బానిసగా ఫీల్ అవుతూ వుంటారు. అందుకే రిలేషన్ పాడవుతుంది.
Advertisement
Also read:
అందువలన భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు వస్తాయి. పెళ్లికి ముందు స్నేహితులు ఉండడం ఆ స్నేహం పెళ్లయిన తర్వాత కూడా కొనసాగించడం లేదంటే ఆఫీస్ లో మరొకరి తో దగ్గరగా ఉండడం లేదా శారీరిక సంబంధం వంటి కారణాల వలన భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతాయి. అహంకారం వలన కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. విడిపోవడం వంటివి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండడంతో పాటుగా ఒకరినొకరు గౌరవించుకోవడం ఇటువంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అలానే సరైన కమ్యూనికేషన్ తో భార్యాభర్తలు సమస్యని సాల్వ్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందులు ఉండవు సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!