పెళ్లి అయిన తరువాతే ఏ జంటని అయినా భార్య, భర్త అని పిలుస్తారు. అయితే.. పెళ్లి అయిన తరువాత నుంచి వీరిద్దరూ కలిసే పడుకుంటారు. పెళ్లి అయ్యాక వారి వైవాహిక జీవితం బాగుండాలని అందరు కోరుకుంటారు. అయితే, ఇందుకోసం భార్య, భర్త ఇద్దరూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి భార్యా తన భర్తకు ఎడమ వైపున నిద్రిస్తే మంచిది. ఇందుకు గల శాస్త్రీయ కారణాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. నిజానికి ఎటువైపు పడుకోవాలి అన్నది ఎవరికీ వారి స్వంత ఇష్టం. కానీ ఇందులో వాస్తురీత్యా కొన్ని కారణాలు ఉన్నాయి.
Advertisement
Advertisement
కేవలం వాస్తు శాస్త్రం మాత్రమే కాదు, ఆయుర్వేదం కూడా జంటలకు నిద్ర దిశ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఆయుర్వేదం ప్రకారం, జంటలకు సరైన నిద్ర దిశ జంట వారి ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, భార్య తన భర్తకు ఎడమ వైపున నిద్రించాలి, ఇది జంట యొక్క మొత్తం శ్రేయస్సును నిర్ధారిస్తుంది. ఈ దిశలో నిద్రపోవడం రక్త ప్రసరణను పెంచడానికి, శ్వాసను మెరుగుపరచడానికి మరియు గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. వాత దోషం ఉన్నవారు, ఆందోళన మరియు చేతులు చల్లడం వంటి సమస్యలు ఉన్నవారు దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో తల ఉంచి నిద్రించాలి.
గురక పెట్టె అలవాటు ఉన్న స్త్రీలు కచ్చితంగా ఎడమవైపుకు పడుకుంటే వారి శ్వాస మెరుగుపడి గురక అలవాటు నెమ్మదిగా తగ్గుతుంది. భర్త ఎడమవైపుకు పడుకునే స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు చిన్న ప్రేగు నుంచి పెద్ద ప్రేగు వైపు తేలికగా కదులుతాయి. అలాగే గుండె ఆరోగ్యం కూడా మంచిగా బాగుంటుంది. భర్తకి ఎడమవైపుకు పడుకోవడం వలన గర్భాశయం సరిగా ఉంది, పిండం ఆరోగ్యంగా ఉంటుంది.