చాలా మంది ఇంటి గడపకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. రోజు రాయడానికి ఖాళీ లేకపోయినా శుక్రవారం పూటనో లేదంటే పండగలప్పుడో ఇలా వీలు కుదిరినప్పుడు గుమ్మనికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే పసుపు నీళ్లని ఇంటి ముందు చల్లుతూ ఉంటారు. అయితే ఎందుకు ఇలా చేయాలి దీని వలన మనకి శుభం జరుగుతుందా దేవుడు ఆశీస్సులు లభిస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
పసుపు కుంకుమ కి ఎంత విశిష్టత ఉందో ప్రతికించి చెప్పక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే పెద్దలు నీళ్లల్లో పసుపుని కలిపి శుద్ధి చేసేవారు. పసుపు ఇంట్లో ఉంటే సిరిసంపదలు కూడా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వంటివి తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాగి చెంబు ని పెట్టి అందులో పసుపు నీళ్లు, ఒక పువ్వు వేసి ఉంచుతారు గుమ్మనికి పసుపు రాసి బొట్లు పెట్టడం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. నిజానికి పసుపు నీళ్ల ని పెట్టడం, గడపకి పసుపు రాయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా పసుపు కీటకాలు వంటివి చేరకుండా చూస్తుంది. అందుకనే పసుపుని రాయడం పసుపు నీళ్లు చల్లడం వంటివి చేస్తారు.
Also read:
- మొక్కజొన్న తిన్న వెంటనే అస్సలు నీళ్లు తాగకూడదు… ఎందుకంటే..?
- వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ మూవీలో ఈ మిస్టేక్ మీరు గమనించారా ?
- Miss Shetty Mr Polishetty Telugu review: ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా హిట్టా, ఫట్టా..?