Home » మహాత్మా గాంధీ, వైఎస్, యండమూరిల బాత్ రూమ్ లో పెన్ పుస్తకం ఎందుకు ఉండేవి…?

మహాత్మా గాంధీ, వైఎస్, యండమూరిల బాత్ రూమ్ లో పెన్ పుస్తకం ఎందుకు ఉండేవి…?

by Venkatesh
Ad

మీరు ఎప్పుడైనా గమనిస్తే స్నానం చేసే సమయంలో మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు ఆ టైం లో మనకు పరిష్కారం కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. అసలు స్నానం చేసే సమయంలో మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయో ఒకసారి చూద్దాం. స్నానం చేసేటప్పుడు మనం ఎక్కువగా… ఆత్మానుభూతి లో ఉంటాం. మనస్సు -ఆత్మ- హృదయం సంతులనాత్మకంగా ఉండటంతో అనవసర ఆలోచనలకు చాలా దూరంగా ఉంటాం.Mahatma Gandhi's experiments with food and the lessons we can learn | The  Times of India

సరిగా చెప్పాలి అంటే అవ్యక్తంగా ఉంటామన్నట్టు. దీనితో మెదడు చైతన్యవంతంగా ఉంటుంది అని చెప్పాలి. మనసులో అప్పటి వరకు ఉండే ఆలోచనలు పోయే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలకు మనం పదును పెట్టె అవకాశం ఉంది. ఆ సమయంలో వచ్చే ఆలోచనతో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని మర్చిపోకుండా గుర్తు ఉంచుకోవడం మంచిది. అందుకే కొంతమంది ప్రముఖులు వారు స్నానాల గదిలో ఒక పెన్ను పుస్తకం ఉంచుకునే వారట.A celluloid tribute to Y S Rajasekhara Reddy

Advertisement

Advertisement

ఆలోచన రాగానే కొందరు వాటిని నమోదు చేసుకుంటూ ఉండే వారు. జాతిపిత మహాత్మా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ బాత్ రూమ్ లో ఒక పెన్ ఉంచుకునే వారు. ఆలోచన వచ్చిన వెంటనే దానికి సంబంధించిన క్లూ లేదా రెండు లైన్ లను అక్కడ నమోదు చేసుకునే వారు. ప్రతి ఆలోచనను రికార్డ్ చేయడం నిజంగా ఒక మంచి అలవాటు అనే చెప్పాలి. యండమూరి వీరేంద్ర నాథ్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

Visitors Are Also Reading