Home » ఇండియాలో మ్యాచ్ జ‌రిగితే రెండు సీట్లు ల‌తా మంగేష్క‌ర్ కోసమేన‌ట‌.. ఎందుకో తెలుసా..?

ఇండియాలో మ్యాచ్ జ‌రిగితే రెండు సీట్లు ల‌తా మంగేష్క‌ర్ కోసమేన‌ట‌.. ఎందుకో తెలుసా..?

by Anji
Ad

ల‌తా మంగేష్క‌ర్ ఇటీవ‌లే లోకాన్ని వీడి వెళ్లార‌న్న వార్త‌ను అభిమానులు ఇంకా జీర్ణం చేసుకోలేక‌పోతున్నారు. 92 ఏళ్ల ల‌తా మంగేష్క‌ర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి విధిత‌మే.

Also Read :  బుల్లి తెర నుంచి వెండి తెర‌పైకి వ‌చ్చిన టాలీవుడ్ సెలబ్రెటిస్ వీరే..!

Advertisement

అయితే చాలా మందికీ ల‌త మంగేష్క‌ర్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలియ‌దు. ఆమె సినీ ఇండ‌స్ట్రీలో దాదాపు 80 ఏళ్ల పాటు కొన‌సాగింది. ఇన్నేండ్ల‌లో ఆమెపై ఒక్క రూమ‌ర్ కూడా రాలేదు. ఆమె వ్య‌క్తిగ‌త ప్రేమ గురించిన మాట‌లు కొన్ని అక్క‌డ‌క్క‌డా వినిపించినా ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఎటువంటి వివాదానికి ఆమె జీవితంలో తావులేదు. ఇదిలా ఉండ‌గా.. ల‌తా మంగేష్క‌ర్ క్రికెట్‌కు వీరాభిమాని. ఆమెకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం. 1983లో భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ని గెలిచింది.

Advertisement

దేశ‌మంతా సంతోషంలో మునిగిపోయింది. కానీ ఆ స‌మ‌యంలో భార‌త జ‌ట్టుకు బీసీసీఐ ఏవిధ‌మైన న‌గ‌దు బ‌హుమ‌తిని ఇచ్చే ప‌రిస్థితిలో లేదు. ఈ ప‌రిస్థితిలో ల‌తా మంగేష్క‌ర్ ఆ రోజుల్లో దాదాపు ఇర‌వై ల‌క్ష‌ల‌ని బీసీసీఐకి అందించారు. అలా క్రికెట్ ప‌ట్ల త‌న‌కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అప్ప‌టినుంచి బీసీసీఐ త‌రుపున ల‌తా మంగేష్క‌ర్ కోసం ఇండియ‌న్ స్టేడియంలో రెండు సీట్ల‌ను క‌చ్చితంగా ఖాళీగా ఉంచుతున్నారు. ఇండియ‌న్ జ‌ట్టు, ఎప్పుడూ ఇండియాలో ఆడినా ల‌తా మంగేష్క‌ర్ కోసం క‌చ్చితంగా రెండు సీట్లు అందుబాటులో ఉంటాయి.

Also Read :  హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్‌ను అప్పుడు అంత‌లా దూషించార‌ట‌..!

Visitors Are Also Reading