Home » చిరు, రామ్ చరణ్ జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకున్న టాలీవుడ్ ఎందుకు సైలెంట్ గా ఉంది ? ఎవరు పట్టించుకోలేదా ?

చిరు, రామ్ చరణ్ జాతీయ స్థాయిలో అవార్డ్స్ గెలుచుకున్న టాలీవుడ్ ఎందుకు సైలెంట్ గా ఉంది ? ఎవరు పట్టించుకోలేదా ?

by AJAY
Ad

మన సినిమాలకు ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా జపాన్ లాంటి దేశంలో సైతం టాలీవుడ్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక నటీనటులకు సైతం అదే రేంజ్ లో గుర్తింపు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ ఫిలిం అవార్డుల దినోత్స‌వంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

Advertisement

అయితే ఈ అవార్డును అందుకోవడం చాలా గొప్ప… అయినప్పటికీ చిత్ర పరిశ్రమ నుండి చిరంజీవికి ఎటువంటి అభినందనలు అందలేదు. నటినటులు పెద్దగా పట్టించుకోలేదు. మెగాస్టార్ ను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టామ‌ని చాలా మంది చెబుతుంటారు. కానీ ఒక్క‌రు కూడా చిరు ను ప్ర‌శంసించ‌లేదు. అయితే అలా ఎందుకు జరిగింది అనే కారణం తెలియదు గానీ చిరంజీవిని ఎవరూ ప్రశంసించక‌పోవం మాత్రం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది..

Advertisement

అంతేకాకుండా తండ్రి జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న వారం రోజుల్లోనే ఆయన తనయుడు రామ్ చరణ్ కు సైతం ఓ అవార్డు దక్కింది. ఎన్డీటీవీ ఫ్యూచర్ ఫిల్మ్ పర్స‌నాలిటీ ఆఫ్ ఇండియా అవార్డును రామ్ చరణ్ కు బహుకరించింది. అయితే తండ్రి కొడుకులు సాధించిన ఈ అవార్డుల పట్ల మెగా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ అవార్డుల పట్ల ఎటువంటి ప్రశంసలు అందకపోవడంతో మీడియాలో సైతం ఈ వార్త పెద్దగా విడిపించలేదు. దాంతో చిరు రామ్ చరణ్ గొప్ప‌ అవార్డులు గెలుచుకున్నా టాలీవుడ్ ఎందుకు మూగబోయింది..? అన్న ప్రశ్న చాలా మందికి వ‌స్తోంది.

Visitors Are Also Reading