ప్రస్తుతం రోజు రోజుకు అవినీతి పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వాస్తవానికి లంచం తీసుకోవడం నేరమే. కానీ లంచం ఇవ్వడం కూడా నేరమని విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొందరూ ప్రభుత్వ అధికారులు మాత్రం లంచం ఇవ్వనిది పని చేయరు. ఈ లంచాన్ని అరికట్టడమే అవినీతి నిరోధక శాఖ పని.
Advertisement
ఏసీబీ (యాంటీ కరెప్షన్ బ్యూరో) అధికారులు లంచం తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని శిక్షిస్తారు. లంచం తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం రక రకాల చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా సాక్షాలతో పాటు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రాంతంలో డబ్బులతో పాటు పింక్ కలర్ బాటిల్స్ కూడా కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ పింక్ బాటిల్స్ ని గమనించారా ? అక్కడ పింక్ కలర్ బాటిల్స్ ని ఎందుకు ఉంచుతారు. అసలు ఆ పింక్ కలర్ బాటిల్ లో ఉన్న లిక్విడ్ ఏంటి ? లంచం తీసుకున్న సమయంలో ఆ బాటిల్స్ ఉంచడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినప్పుడు సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ముందుగానే సమాచారం అందిస్తాడు. ఏసీబీ అధికారులు ఆ వ్యక్తికి లంచం ఇచ్చే డబ్బులపై ఫినాప్తలిన్ పౌడర్ చల్లుతారు. సదరు వ్యక్తి ఆ డబ్బులు లంచంగా ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చిన తరువాత ఆ ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు లెక్క పెడితే ఆ నోట్లకు ఉండే పినాప్తలిన్ పౌడర్ ప్రభుత్వ అధికారి చేతులకు అంటుకుంటుంది. అప్పుడే వెంటనే ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇస్తారు. లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి చేతులను సోడియం కార్బోనేట్ కలిపిన నీటిలో ముంచి బయటికీ తీస్తారు. నీటిలో ముంచడం వల్ల చేతికి అంటిన పినాప్తలిన్ పౌడర్ ఆ నీటిలో కలిసి పింక్ కలర్ రూపంలోకి మారుతుంది. సోడియం కార్బోనేట్ అనేది ఆల్కలైన్ ద్రావణం కావడంతో అది పింక్ కలర్ గా ఏర్పడుతుంది. ఈ పింక్ కలర్ బాటిల్ ని కోర్టులో సాక్ష్యంగా చూపించడం ద్వారా లంచం తీసుకున్న అధికారికి శిక్ష పడేలా చేస్తారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే