టాలీవుడ్ ఫేమస్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు 37 సంవత్సరాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు చిత్ర పరిశ్రమతో… సిరివెన్నెల సీతారామశాస్త్రి విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఒక్కసారిగా ఆయన మరణించడంతో అందరు షాక్ కు గురయ్యారు. అయితే ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానం లో జరిగాయి.
అయితే ఆయన అంతిమ యాత్రకు టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలయ్య, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, తనికెళ్ల భరణి తదితరులు… తరలివచ్చారు.. ఈ సందర్భంగా ఈ సినీ ప్రముఖులు అంతా సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే టాలీవుడ్ ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన మంచి ఫ్యామిలీ నుంచి మాత్రం సీతారామశాస్త్రి అంత్యక్రియలలో ఎవరు పాల్గొనలేదు. దీంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా దీనిపై స్వయంగా మంచు మోహన్ బాబు స్పందించారు.
Advertisement
Advertisement
read also : “ఆర్ఆర్ఆర్” సాంగ్ తో అమెరికాలో రచ్చ… వీడియో వైరల్
” సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే తన తమ్ముడు చనిపోవడం కారణంగా తమ కుటుంబ సభ్యులంతా తిరుపతి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బయటకు ఎవరు వెళ్ళకూడదని పంతులు గారు చెప్పడం కారణంగానే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతక్రియలలో పాల్గొనలేదని మంచు మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.