Home » కంప్యూట‌ర్ కీ బోర్డుపై ఆ లెట‌ర్ల కింద గీత‌ ఎందుకు ఉంటుందో తెలుసా..?

కంప్యూట‌ర్ కీ బోర్డుపై ఆ లెట‌ర్ల కింద గీత‌ ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Bunty
Ad

నిత్యం మ‌నం అంత‌గా గ‌మ‌నించం కానీ.. కొన్నిసార్లు గ‌మ‌నిస్తుంటే అనేక విష‌యాలు తెలుస్తుంటాయి. అయా వ‌స్తువుల‌పై ఉన్న చిహ్నాలు, లేదా అక్ష‌రాలు, దానికి సంబంధించిన వివ‌రణ ఇలా ఏదైనా అనేక గుర్తులు ఉంటుంటాయి.

Advertisement

అయితే మేము ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా.. అలాంటి ఒక వ‌స్తువు గురించే.. ఇంత‌కి ఏమిట‌ది అనే క‌దా మీరు అడిగేది. అదేమి లేదు అండి ఆ వ‌స్తువు మ‌రేదో కాదు. కంప్యూట‌ర్ గురించే మ‌నం తెలుసుకోవాల్సింది.

కీ బోర్డు గురించి ఏమి తెలుస్తుంద‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోకండి. దానిని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే కీ బోర్డు మ‌న‌కు ఓ విష‌యాన్ని తెలియ‌జేస్తుంది.కంప్యూట‌ర్ కీ బోర్డుపై ఉన్న అక్ష‌రాల‌ను ఎప్పుడైనా గ‌మ‌నించారా..? మీరు చూసే ఉంటారు. కానీ వాటిని జాగ్ర‌త్త‌గా ఓ సారి ప‌రిశీలించండి. ముఖ్యంగా కీ బోర్డు పై ఉండే ఎఫ్‌, జే అక్ష‌రాల కింద చిన్న గీత‌లు ఉంటాయి. వాటి వ‌ల్ల మ‌న‌కు ఓ విష‌యం తెలుస్తోంది.

Advertisement

అదేమిటంటే కంప్యూట‌ర్ కీబోర్డు పై ఆ లెట‌ర్ల‌పై రెండు గీత‌లుండ‌డానికి కార‌ణం సుల‌భంగా టైప్ చేయ‌డం కోసం అలాంటి సంద‌ర్భంలో ఈ గీత‌లు ప‌నికొస్తాయి. ఏయే అక్ష‌రాల‌పై వేళ్లు ప‌డుతున్నాయో సులభంగా తెలుసుకొని దాని ప్ర‌కారం టైప్ చేయ‌వ‌చ్చు. అయితే కొత్త‌గా నేర్చుకునే వారు ఎలాగో అక్ష‌రాల‌ను చూస్తారు కానీ, ఈ లెట‌ర్ల కింద గీత‌ను గుర్తు పెట్టుకుంటే టైపింగ్ సుల‌భంగా వ‌స్తుంది. త్వ‌ర‌గా టైపింగ్ నేర్చుకోగ‌లుగుతారు. అందులో ఫాస్ట్‌గా త‌యారు అవుతారు. అక్ష‌రాల కింద ఉండే గీత‌ల వ‌ల్ల అంధులు కూడా సుల‌భంగా కంప్యూట‌ర్‌పై టైప్ చేయ‌గ‌ల‌రు. అందుకే ఆ రెండు అక్ష‌రాల కింద గీత‌ల‌ను ఇచ్చారు. అయితే టైప్ చేసేట‌ప్పుడు ఎవ‌రి రెండు చేతులు అయినా ఎడ‌మ చేతి చివ‌రి మూడు వేళ్లు.. ASD, కుడిచేతి చివ‌రి మూడు వేళ్లు ;LK అక్ష‌రాల‌పై ఉంటాయి. ఆ అక్ష‌రాల‌కు అవే సూటు అవుతాయి కాబ‌ట్టే f, j లెట‌ర్ల‌కు కింద చిన్న గీత‌ల‌ను ఇచ్చారు. బొట‌న వేళ్లు రెండు స్పేస్ బ‌ట‌న్ పై ఉంటాయి. దీంతో టైపింగ్ సుల‌భంగా, వేగంగా చేసుకోవ‌చ్చు.

 

Visitors Are Also Reading