Tarun: హీరో తరుణ్ గురించి కొత్తగా పరిచయం చెక్కరలేదు. ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో సెన్సేషన్ ని క్రియేట్ చేశారు తరుణ్. తెలుగు సినీ ప్రియులకి తరుణ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు. ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయాడు.
Advertisement
బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి పలు సినిమాలు చేశాడు పదేళ్ల పాటు మంచి సినిమాలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. తరుణ్ సినిమాలు ఎందుకు చేయడం మానేశాడు అనే విషయం ని ఎమ్మెస్ నారాయణ కొడుకు ఎమ్మెస్ విక్రమ్ మొదటిసారి వివరించారు.
1990లో అంజలి సినిమాలో బాల నటుడుగా చేశాడు. కేవలం ఏడేళ్ల వయసులోనే ఈ సినిమా చేసాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చాలా సినిమాలు చేశాడు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను ఇలా చాలా సినిమాల తో అందరినీ అలరించాడు. 2011 తర్వాత నుండి ఏ ఒక్క సినిమాలో కూడా కనపడలేదు.
Advertisement
Also read:
Also read:
ఏళ్ల పాటు హీరోగా కొనసాగిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఎందుకు సినిమాలు మానేసాడు అంటే, చాలామంది బ్యాగ్రౌండ్ ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవం అని విక్రమ్ అన్నారు. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా ఒక్కో సారి సక్సెస్ కాలేరని ఉదాహరణకి తరుణ్ణి తీసుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందని అందువలన ఉద్యోగాలు బిజినెస్ లు వదులుకొని మరీ ఇండస్ట్రీ లోకి వస్తారని అన్నారు. తరుణ్ కూడా అవకాశాలు రాకే ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయారని అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!