Home » నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినా తారకరత్న హీరోగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు..? 5 కారణాలు ఇవేనా..!

నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినా తారకరత్న హీరోగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాడు..? 5 కారణాలు ఇవేనా..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలోకి వార‌సులుగా ఎంట్రీ ఇచ్చారంటే మిగితావాళ్ల‌కంటే కాస్త ఎక్క‌వే ప్రధాన్య‌త ఉంటుంది. బ‌డా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు సినిమాలు చేసేందుకు మందుకు వ‌స్తుంటారు. కాబ‌ట్టి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చేవారికంటే బ్యాగ్రౌండ్ ఉన్న‌వాళ్లు స్టార్ లు అవ్వ‌డానికి ఎక్కువ అవ‌కాశం ఉంది. కానీ అవ‌కాశం వ‌చ్చిన త‌ర‌వాత కూడా దాన్ని వినియోగించుకోకపోతే కెరీర్ లో ఫ్లాప్ లు చూడ‌క త‌ప్ప‌దు.

Advertisement

అలాంటి ప‌రిస్థితే నంద‌మూరి హీరోతార‌క ర‌త్న‌కు వ‌చ్చింది. టాలీవుడ్ ను ఏలిన నంద‌మూరి తార‌క‌రామారావు ఫ్యామిలీ నుండి తార‌క‌ర‌త్న హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో తార‌క‌ర‌త్న ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. కానీ ఆ త‌ర‌వాత తార‌క‌త‌ర్న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు. చివ‌రికి అస‌లు థియేట‌ర్ లో విడుద‌ల కాని సినిమాల్లోనూ తార‌క‌రత్న న‌టించాల్సి వ‌చ్చింది.

Advertisement

అయితే ఇప్పుడు తార‌క‌ర‌త్న‌కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తున్న ఓ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం తార‌కర‌త్న‌కు ద‌క్కిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తార‌క‌ర‌త్న ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డానికి కొన్నికార‌ణాలు ఉన్నాయంటూ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తార‌క‌ర‌త్న బ‌క్క‌ప‌లుచ‌గా క‌నిపించాడు. కాబ‌ట్టి అత‌డి ఎంట్రీ లుక్ కాస్త నిరాశ‌ప‌ర్చ‌డంతో ఫ్యాన్స్ ను సంపాదించుకోలేక‌పోయారు.

మొద‌టిసినిమా కోదండ‌రామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో చేయ‌గా ఆ త‌ర‌వాత సినిమాల‌న్నీ కొత్త‌ద‌ర్శ‌కుల‌తో చేయ‌డం వ‌ల్ల మైన‌స్ అయ్యింద‌ట‌. అంతే కాకుండా నంద‌మూరి ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా తార‌క‌ర‌త్న‌కు భ‌హిరంగంగా ఎక్క‌డా క‌నిపించ‌కపోవ‌డం వ‌ల్ల కూడా తార‌క‌ర‌త్నకు మైన‌స్ అయ్యింది. మ‌రోవైపు తార‌కర‌త్న ఓ అమ్మాయిని ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టంలేక‌ తార‌క‌ర‌త్న‌ను కుంటుంబ స‌భ్యులు దూరం పెట్టడం వ‌ల్ల కూడా అత‌డి కెరీర్ పై ప్ర‌భావం చూపి ఉండ‌వ‌చ్చు. ఇదిలా ఉంటే మొత్తానికి తార‌క‌ర‌త్న కెరీర్ ఇప్పుడు ట్రాక్ ఎక్కుతోంది. ముందు ముందు తార‌క‌ర‌త్న ఎలాంటి విజ‌యాలు అందుకుంటాడో చూడాలి.

Also read :

భార్యలు భర్తల దగ్గర ఈ విషయాలను అస్సలు దాచి పెట్టకూడదా..? అలా దాచి పెడితే వచ్చే నష్టాలు అవేనా..?

Visitors Are Also Reading