Home » కృష్ణ చేయాల్సిన పసివాడి ప్రాణం ఎందుకు ఆగిపోయింది…?

కృష్ణ చేయాల్సిన పసివాడి ప్రాణం ఎందుకు ఆగిపోయింది…?

by Azhar
Ad
మన ఇండియాలో నార్త్ ఇండియాలో వచ్చే సినిమాలకు బాలీవుడ్ సినిమాలుగా గుర్తింపు ఉంటె.. మన సౌత్ ఇండియాలో మాత్రం ఏ రాష్ట్రానికి… ఆ రాష్ట్రానికే ఓ సినీ ఇండస్ట్రీ ఉంది. కానీ దేశంలో ఇన్ని ఇండస్ట్రీలు ఉన్న… ఒక్కదానిలో హిట్ అయిన సినిమాను మరో భాషలోకి రీమేక్ చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో చాలా కారణంగా వస్తున్నదే.
అయితే 1985 లో ఇంగ్లిష్ లో వచ్చిన విట్నెస్ అనే సినిమాను చుసిన మళయాళ రచయిత ఫాజిల్… కథలో కొన్ని మార్పులు చేసి… మమ్ముటి హీరోగా తెరకెక్కించారు. అది కాస్త సూపర్ హిట్ కావడంతో… అన్ని ఇండస్ట్రీల నుండి చాలా మంది ప్రొడ్యూసర్లు దీని రీమేక్ హక్కుల కోసం పోటీ పడ్డారు. మన తెలుగులో ఆ హక్కులు.. అల్లు అరవింద్ దకించుకున్నారు. అందులో చిరంజీవిని హీరోగా అనుకోని… పసివాడి ప్రాణం అని టైటిల్ పెట్టారు.
కానీ ఇదే సమయంలో తెలుగు రచయిత విజయబాపినీడు కూడా అదే విట్నెస్ సినిమాను చూసి.. కథలో తన స్టైల్ లో మార్పులు చేసి.. సాక్షి అనే పేరుతో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. అందులోని చిన్నపిల్లడి పాత్రకు మహేష్ బాబును అనుకున్నారు. అయితే ఇదే రకమైన కథతో చిరంజీవి కూడా సినిమా చేస్తున్నాడు అని తెలుసుకున్న కృష్ణ… ఒక్కే విధమైన కథతో రెండు సినిమాలు రావడం మంచిది కాదు.. సాక్షిని నిలిపివేశారు. ఈ విధంగా… కృష్ణ చేయాల్సిన పసివాడి ప్రాణం వంటి కథ మిస్ అయ్యింది.
ఇది కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading