Home » తండ్రి స్టార్ హీరో అయినా శోభ‌న్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా..?

తండ్రి స్టార్ హీరో అయినా శోభ‌న్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోగా కొన‌సాగిన హీరో సోగ్గాడు శోభ‌న్ బాబు. ఆయ‌న అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. అంతే కాకుండా శోభ‌న్ బాబుకు లేడీ ఫాలోయింగ్ ఏ ఎక్కువ ఉంటుంది. శోభ‌న్ బాబు ఎక్కువ‌గా క‌థ‌కు ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లోనే న‌టించి అల‌రించేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవ‌లం త‌న న‌ట‌న‌ను సినిమాల‌పై ఉన్న ప్రేమ‌ను మాత్ర‌మే నమ్మ‌కుని శోభ‌న్ బాబు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

shobanbabu

Advertisement

 

అంతే కాకుండా టాలీవుడ్ లో అవ‌కాశాల కోసం శోభ‌న్ బాబు నిర్మాత‌ల ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఉద‌యం కాలేజీకి వెళ్లి చ‌దువుకుని మ‌ద్యాహ్నం శోభ‌న్ బాబు అవ‌కాశాల కోసం ఆఫీసుల‌కు వెళ్లేవారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చాడు కాబ‌ట్టి నేరుగా హీరో అయిపోలేదు.

shoban babu rejected athadu movie

shoban babU

ముందు సినిమాల్లో సైడ్ పాత్ర‌లు చేసి మెప్పించి ఆ త‌ర‌వాత హీరోగా అవ‌కాశాల‌ను అందుకున్నాడు. కాస్త వ‌య‌సు పెర‌గ‌గానే శోభ‌న్ బాబు పూర్తిగా సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను సోగ్గాడిగానే జ‌నాలు గుర్తుపెట్టుకోవాల‌ని శోభ‌న్ బాబు కాస్త ఏజ్ పెర‌గ్గానే సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఇక శోభ‌న్ బాబు వ‌య‌సు పై బ‌డ‌టం వ‌ల్ల 70 ఏళ్ల వ‌య‌సులో 2008లో మ‌ర‌ణించారు. ఇదిలా ఉండ‌గా ఇండ‌స్ట్రీలో హీరోల నుండి టెక్నీషియ‌న్ ల వ‌రకూ అంద‌రి వార‌సులు వార‌సత్వంగా ఎంట్రీ ఇస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

కానీ శోభ‌న్ బాబు ఫ్యామిలీ నుండి ఎవ‌రూ సినిమాల్లోకి రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అయితే ఇదే విష‌య‌మై తాను శోభ‌న్ బాబును కూడా ప్ర‌శ్నించాన‌ని న‌టుడు రాజా ర‌వీంద్ర ఓ ఇంట‌ర్య్వూలో తెలిపారు. దానికి శోభ‌న్ బాబు తాను ప్ర‌తి సినిమాకు క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని..ప్ర‌తి సినిమాకు టెన్ష‌న్ ప‌డుతున్నాన‌ని ఆ క‌ష్టం నా కొడుకుకు ఎందుకు అని స‌మాధానం ఇచ్చార‌ని తెలిపారు. అందువ‌ల్లే శోభ‌న్ బాబు కుమారుడు సినిమాల్లోకి రాలేద‌ని చెప్పారు.

Also Read:

“దేవి పుత్రుడు” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…! 

అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

Visitors Are Also Reading