Home » శుభకార్యాల్లో కట్నాలు ఎందుకు చదివిస్తారు ? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా?

శుభకార్యాల్లో కట్నాలు ఎందుకు చదివిస్తారు ? దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా?

by Anji
Ad

సాధారణంగా మనలో ఎవరి ఇంట్లోనైనా ఏదైనా శుభకార్యం జరిగితే.. వాటికి హాజరైన బంధు, మిత్ర వర్గాల వారందరూ కొందరూ ఏదైనా బహుతి తీసుకొస్తే.. మరికొంత మంది కట్నాల కింద డబ్బులను బహుమతిగా ఇస్తారు. అందరూ ఒకే విధంగా ఏమి ఇవ్వరు. ఎవరికీ నచ్చినట్టు ఇస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం పూర్వకాలంలో ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే వారి బంధువులందరూ కట్నంగా చదివించేవారు. పిల్లకు సొమ్ముగా కాకుండా కన్యధాతకు ఉండేది. ఈ పెళ్లి ఖర్చులు పెళ్లి కూతురు తండ్రి భరిస్తాడు కాబట్టి అతనికి ఆసరాగా ఉంటాయని కట్నాలు చదివించే వారు. 

Advertisement

వీటిని తుని, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో కట్నాలు చదివింపును ఈడెతలు అని పిలుస్తారు. ఈడెతలు అనగా విడిగా వేయడం అని అర్థం. పూర్వకాలానికి, ఇప్పటికీ చాలా తేడా ఉందనే చెప్పవచ్చు. అమ్మాయికి చదివింపులు రూ.100 అయితే.. కన్యధాతకు రూ.10వేలు ఇస్తుంటారు. ముఖ్యంగా చదివించడం అంటే మామూలుగా వారికి ఇస్తే గుర్తుండదు. మేము ఇంత ఇచ్చామని చదివిస్తుంటారు. అలా చదివించడం ద్వారా అందరికీ తెలిసిపోతుంది. 

Advertisement

ముఖ్యంగా పూర్వకాలంలో అయితే చిన్న చిన్న గ్రామాల్లో పెళ్లికి డబ్బులు లేక బంధువులు, స్నేహితులు ఇలా అందరూ వేసే డబ్బులతోనే పెళ్లిళ్లు జరిగేవి. వచ్చిన దానిని బట్టి భోజనాల ఖర్చు చూసుకుంటారు. పెళ్లిలలో గిప్ట్ లు ఇవి పూర్వకాలంలో లేవు. ముఖ్యంగా డబ్బుగా మనం చదివిస్తే అవి వారికి ఉపయోగపడుతాయి. ఉపయోగపడుతాయనే ఉద్దేశంతోనే చదివింపులను ఎప్పుడో మన పెద్దలు ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది.   అప్పటి కాలానికి అనుగుణంగా వారు అలా చేశారు. ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ నచ్చింది వారు ఇస్తున్నారు. కొంత మంది వస్తువులు, బంగారం, వెండి లాంటివి బహుమతిగా ఇస్తుంటే.. మరికొందరూ ఇతర బహుమతులు ఎవరికీ నచ్చిన విధంగా వారు శుభకార్యాల్లో ఇస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వేసవికాలంలో ఈత పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

పిల్లల మందు తల్లిదండ్రులు ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు..!

ఎండాకాలంలో బీరు తాగుతున్నారా ? బీరు వల్ల లాభాలు ఎన్నో..!

Visitors Are Also Reading