ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయింది ఈ సీజన్లో ధోనీని దక్కించుకోవాలని ఆర్సిబి భావించింది. ధోని కోసం మొదటగా ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని దక్కించుకుంది ఆ వేలంపాటలో ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా ధోని రికార్డు సృష్టించాడు అయితే ఆర్సిబి ధోని ని దక్కించు కోకపోవడం వెనుకాల పెద్ద కథ ఉంది.
ఆ విషయాన్ని ఆక్షనెర్ రిచర్డ్ మ్యాడ్లి తెలియజేశాడు. ఐ కాన్ ప్లేయర్ కారణంగా ధోనిని బెంగళూరు కొనలేకపోయిందని పేర్కొన్నాడు. అయితే ఐకాన్ ప్లేయర్ కన్నా మిగతా ప్లేయర్ కి ఎక్కువ ధర పెట్టకూడదనే నియమం ఉంది అని చెప్పాడు బెంగళూరు జట్టుకి ద్రావిడ్ ఐకాన్ గా ముంబై టీం కి సచిన్ ఐకాన్ గా ఉండేవారు. ఈ నిబంధనలను ముంబై మరియు బెంగళూరు టీమ్స్ పాటించక తప్పలేదని తెలిపాడు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుక సీఈవోగా పనిచేసిన చారు శర్మ వర్షన్ మరోలా ఉంది.
Advertisement
ఒకవేళ ధోనిని ఎక్కువ ఖర్చు పెట్టిన అతడు విఫలం అయితే ఏంటి పరిస్థితి అనే కోణంలో ఆలోచించామని పేర్కొన్నాడు అప్పట్లో మహి కోసం ఉండే పోటీని తాము ముందే ఊహించమని చెప్పాడు అయితే ఒకవేళ భూమి బెంగళూరు జట్టు తరఫున ఉండి ఉంటే ఎలా ఉండేదని అభిమానులు అనుకుంటున్నారు సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్గా ప్లేయర్గా బాగా రాణించాడు అయితే సి ఎస్ కే పై నిషేధ విధించిన రెండు సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సీజన్లో ధోని సీఎస్కే కి ప్రాతినిధ్యం వహించాడు కష్టాల్లో జట్టు ఉన్నప్పుడు తాను ఉన్నానని నిరూపించేవాడు 2022లో విఫలమైన చెన్నై టీం ని 2023లో విజేతగా నిలిపాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.