Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ కు నో చెప్పిన పూజా..? కార‌ణం అదేనా..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు నో చెప్పిన పూజా..? కార‌ణం అదేనా..!

by AJAY
Published: Last Updated on

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమా తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే. మొదటి సినిమా తోనే ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజా అందం అభినయానికి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విజయం సాధించలేదు కానీ పూజా వరుస ఆఫర్ లు అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠ పురంలో సినిమా తో పూజా హెగ్డే కెరీర్ మలుపు తిరిగింది.

ఈ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చాయి. ఓ వైపు హీరోయిన్ గా మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది. కానీ రాధే శ్యామ్ సినిమా నుండి పూజా కు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రాధే శ్యామ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరవాత పూజా హీరోయిన్ గా విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఆ తరవాత గ్యాప్ లేకుండానే ఆచార్య తో ముచ్చటగా మూడో ఫ్లాప్ పూజా హెగ్డే ఖాతాలో పడింది. దాంతో ఈ ముద్దుమ్మ ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ పూజా కు ఆఫర్ లు తగ్గడం లేదు.

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాకుండా ఓ బాలీవుడ్ సినిమా కు కూడా సైన్ చేసింది. ఇదిలా ఉండగా నే యనిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పూజా నటిస్తున్నట్టు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కారణం గా ఆ సినిమా నుండి పూజా తప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading