మన పెద్దవాళ్ళ దగ్గరం మనం అప్పుడప్పుడూ ఆశీర్వచనాలు తీసుకోవడం మనకి అలవాటే. ఇంట్లో ఏదైనా పూజ జరిగినప్పుడో, మన పుట్టినరోజులప్పుడో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా చేసేటప్పుడు వారికి అక్షతలు ఇచ్చి వేయించుకుంటారు. ఇలా అక్షతలు ఎందుకు వేయించుకుంటారు? బియ్యానికి పసుపు కొద్దిగా నువ్వుల నూనెను కలిపి అక్షతలు సిద్ధం చేస్తారు. అయితే, ఆశీర్వచనం తీసుకునేటప్పుడు అక్షతలు ఎందుకు వేయించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇక పెళ్లిళ్లు వంటి శుభకార్యాలలోనే మనం ఈ తంతుని ఎక్కువగా చూస్తుంటాం. మిగతా రోజుల్లో ఈ సంప్రదాయాన్ని పాటించేవారు తక్కువ మందే ఉన్నారు. పెద్దవాళ్ళు అక్షతలు వేస్తూ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. ఆశీర్వదించాడు అక్షతలే ఎందుకు వాడతారు అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. అక్షతలు అంటే క్షతం కానిది అని అర్ధం.
Advertisement
క్షతం అంటే నాశనం అని అర్ధం. నాశనము కానీ వాటిని అక్షతలు అంటారు. పువ్వులనే ఉదాహరణగా తీసుకుంటే అవి సాయంత్రానికి వాడిపోతాయి, మరుసటి రోజుకు కుళ్లిపోతాయి. కానీ, అక్షతలు నాశనం కావు. అందుకే మనకి కూడా నాశనం అయ్యేంత నష్టాలు జరగకూడదన్న ఉద్దేశ్యంతో పెద్దలు అక్షతలు వేసి దీవిస్తారు. వీటిని చిన్న పిల్లలకు వేసేటపుడు బ్రహ్మరంధ్రము వైపు వెయ్యాలని, అలా చేయడం వల్ల ఆయురారోగ్యంతో ఉంటారని చెప్తుంటారు. ఒకరి నుంచి మరొకరికి శక్తిపాతం ద్వారా అనుగ్రహం లభించడం కోసమే పెళ్లిలో అక్షతలు కలిపించి తలంబ్రాలు పోయిస్తారు. విరగని బియ్యంలా, బియ్యంలో పసుపు కలిసినట్లు వారిద్దరి జీవితాలు కూడా కలిసిపోవాలని ఈ తంతులో అంతరార్ధం దాగి ఉంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
31 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన మహిళ 90 ఏళ్లలో డెలివరీ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!
సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.