Home » బంగారం ఉన్నా.. కాళ్ళకు వెండి పట్టీలు మాత్రమే ఎందుకు ధరిస్తారు ?

బంగారం ఉన్నా.. కాళ్ళకు వెండి పట్టీలు మాత్రమే ఎందుకు ధరిస్తారు ?

by Bunty
Ad

బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  బంగారం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఎన్నోరకాల ఆభరణాలు ఆడవాళ్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఎంత బంగారం చేయించుకున్నప్పటికీ ఆడవాళ్లు కాలికి మాత్రం బంగారంతో పట్టీలు చేయించుకోరు. వెండితోనే పట్టీలు చేయించుకుంటారు.

Advertisement

దీనికి గల కారణం…వెండి పట్టీలు పెట్టుకోవడం కేవలం ఆచారం మాత్రమే కాకుండా… బంగారంతో పోలిస్తే వెండిలో ఎన్నో రకాల వైద్యగుణాలు ఉన్నాయి. మన శరీరంలో ఎలాంటి బాక్టీరియా ప్రవేశించకుండా వెండి పట్టీలు ఉపయోగపడతాయి. అయితే కాళ్ళకు వెండి పట్టీలు మాత్రమే ఎందుకు ధరిస్తారు అంటే… పూర్వకాలంలో ఎక్కడికి వెళ్లినా కాలినడకన వెళ్లేవారు.

Advertisement

దీంతో ఎన్నో రకాల వైరస్ లు శరీరంలోకి ప్రవేశించకుండా వెండి కడియాలు ధరించేవారు. ఆడవారు ఎక్కువ పని చేయడం వల్ల కాళ్ళకి నొప్పులు వస్తాయి. వెండిని ధరించడం వల్ల వారికి కాలు నొప్పులు రాకుండా ఉంటాయి. అందుకే పూర్వకాలం నుంచి ఇప్పటివరకు మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు. దాన్ని సంప్రదాయంగా భావిస్తారు. కాగా మన ఇండియాలో హిందూ సంప్రదాయాలు ఎక్కువ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కటి సాంప్రదాయం ప్రకారమే నిర్వహిస్తారు. ఏ ఒక్కటి కూడా జవ దాటరు. హిందూ మత సంప్రదాయం ప్రకారం కూడా బంగారం ఉన్న కూడా కాళ్లకు వెండి పట్టీలు మాత్రమే ధరిస్తారని కొంతమంది చెబుతారు.

ఇవి కూడా చదవండి

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

కోలుకున్న కీలక ప్లేయర్స్..BCCI హెల్త్ బులిటెన్ విడుదల

హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Visitors Are Also Reading