Home » టాలీవుడ్ లో అంత మంది హీరోయిన్స్ ఉంటే సాయి పల్లవికి మాత్రమే ఇంత క్రేజ్ ఎందుకు..? 5 కారణాలు ఇవేనా ..!

టాలీవుడ్ లో అంత మంది హీరోయిన్స్ ఉంటే సాయి పల్లవికి మాత్రమే ఇంత క్రేజ్ ఎందుకు..? 5 కారణాలు ఇవేనా ..!

by AJAY
Published: Last Updated on
Ad

హీరోల్లో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఫలానా హీరో కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఎందరో ఉంటారు. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే అలాంటి అభిమానుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. అతి తక్కువ మంది హీరోయిన్లకు మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. ప్రస్తుతం సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో సాయిపల్లవి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Advertisement

 

ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఈ మలయాళ కుట్టి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాలో మలర్ అనే పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో తెలంగాణ యాసలో సాయిపల్లవి మాట్లాడటం ఆమె నటన సినిమాకు ప్లస్ గా నిలిచాయి.

Advertisement

SAIPALLAVI

దాంతో మొదటి సినిమాతోనే సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక అప్పటి నుండి సాయి పల్లవి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోంది. ఇప్పుడు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన మరో సినిమా విరాటపర్వం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా టీజ,ర్ ట్రైలర్ లో కూడా సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఉండగా సాయి పల్లవి కి మాత్రమే ప్రత్యేకమైన క్రేజ్ వుండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…. సౌందర్యకు కూడా సాయి పల్లవి రేంజ్ లో అభిమానులు ఉండేవారు సౌందర్య ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయిపల్లవి కూడా అదే కోవకు చెందుతుంది. అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ తన నటనతోనే ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

saipallavi nagashourya

saipallavi nagashourya

చాలా మంది హీరోయిన్ డబ్బుల కోసం ఎలాంటి రోల్స్ కు అయినా ఒప్పుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు… స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ వచ్చినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అందులో నటించదు. చాలా మంది హీరోయిన్స్ ఎప్పుడు గ్లామర్ షో కు… కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతారు. కానీ సాయిపల్లవి మాత్రం డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ డ్యాన్స్ విషయం లో సాయి పల్లవిని మించిన వాళ్ళు లేరు. సాయి పల్లవి వేసే స్టెప్పులు చూడ్డానికే థియేటర్ కి వెళ్ళే అభిమానులకు కూడా ఉన్నారు.

Visitors Are Also Reading