Home » “మ‌హాన‌టి”లో ఎన్టీఆర్ స్థానంలో జూఎన్టీఆర్ నటించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..!

“మ‌హాన‌టి”లో ఎన్టీఆర్ స్థానంలో జూఎన్టీఆర్ నటించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..!

by AJAY
Ad

శేఖ‌ర్ కమ్ముల వ‌ద్ద అసింస్టెంట్ డైరెక్ట‌ర్ గా పనిచేసిన నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఆశించిన మేర విజ‌యం సాధించ‌లేదు. ఇక‌ మ‌హాన‌టి సినిమాతో నాగ్ అశ్విన్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఎన్నో బ‌యోపిక్ లు వ‌చ్చినప్ప‌టికీ మ‌హానటి లాంటి బ‌యోపిక్ మాత్రం రాలేద‌నే చెప్పాలి. ఈ చిత్రంలో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవిత క‌థ‌ను కండ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపించాడు నాగ్ అశ్విన్.

Advertisement

ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. సినిమాలో ప్ర‌తి ఒక్క‌రి న‌ట‌న ఎంతగానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మ‌హాన‌టిగా న‌టించ‌గా పాత్ర‌కు తగిన న్యాయం చేసింది. ఇక జెమిని గ‌ణేష‌న్ గా సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించి అల‌రించాడు. ఇక ఈ సినిమాలో నాగేశ్వ‌ర్ రావు స్థానంలో నాగ‌చైత‌న్యను చూపించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

కానీ ఎన్టీరామారావు పాత్ర‌లో మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌లేదు. దాంతో నాగ్ అశ్విన్ అలా ఎందుకు చేశారని ప్రేక్ష‌కులు అనుకున్నారు. కాగా దీనిపై నాగ్ అశ్విన్ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం త‌న‌తో పాటూ స్వ‌ప్న దత్ కూడా ఎన్టీఆర్ ను సంప్ర‌దించామ‌ని చెప్పారు.

 

ఎన్టీఆర్ ఒప్పుకుని ఉంటే సినిమాలో ఎక్కువ‌గా ఎన్టీరామారావు సావిత్రి మ‌ధ్య స‌న్నివేశాలు ఉండేవని చెప్పారు. అంతే కాకుండా జెమిని గ‌ణేష‌న్ రోల్ కోసం సావిత్రి రోల్ కోసం చాలా మందిని వెతికామ‌ని చెప్పారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ను మొద‌ట‌గా జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో చూపించాల‌ని అనుకున్నాన‌ని కానీ తెలుగు మాట్లాడితే త‌మిళ్ స్లాంగ్ రాద‌ని దుల్కర్ స‌ల్మాన్ ను తీసుకున్నామ‌ని నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు.

Visitors Are Also Reading