Home » సినిమా ఫంక్షన్ లకు కేరాఫ్ అడ్రస్ గా కర్నూల్ ఎందకు మారుతుంది..?

సినిమా ఫంక్షన్ లకు కేరాఫ్ అడ్రస్ గా కర్నూల్ ఎందకు మారుతుంది..?

by Azhar
Ad

సినిమా అనేది ఓ పెద్ద పని. ఇది ఎంత కష్టపడి తీస్తున్నారో అంతే కష్టపడి ప్రమోషన్స్ కు చేస్తున్నారు. అయితే ఒక్కపుడు కేవలం సినిమాకు ఆడియో రిలీజ్ ఒక్కడే జరిగేది. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ నుండి సక్సెస్ మీట్ వరకు పదుల సంఖ్యలో ఫంక్షన్స్ అనేవి చేస్తున్నారు . వీటితో పాటుగా ఈ మధ్య హీరో, హీరోయిన్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఒక్కపుడు ఈ ఫంక్షన్స్ మొత్తం హైదరాబాద్ లో జరిగేవి. కొన్ని మాత్రం వైజాగ్ లో జరిగేవి.

Advertisement

కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్స్ మొత్తం కర్నూల్ కు షిఫ్ట్ అవుతున్నాయి. ప్రతి సినిమాకు సంబంధించిన ఏదో ఒక్క ఫంక్షన్ అనేది కర్నూల్ లో తప్పకుండ జరుగుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ యూక అఖండ సినిమా సక్సెస్ మీట్, మహేష్ బాబు సర్కారు వారి పాట సక్సెస్ మీట్, రానా సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా కర్నూల్ లోనే జరిగింది. అయితే దీనిని వరుణుడు సరిగ్గా జరగనివ్వలేదు. అయిన కూడా ఇంకా కొన్ని సినిమా ఫంక్షన్ ఇక్కడే జరగనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఇలా ఈ ఇండస్ట్రీ మొత్తం కర్నూల్ కు ఎందుకు షిఫ్ట్ అయ్యింది అనే విషయంలో కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది అక్కడి ప్రజలను స్పీమాలు అనే చాలా ఇష్టం. అందుకే అక్కడ ఫంక్షన్ చేయడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ అనేది వస్తుంది అని ఆలోచిస్తున్నారు. ఇక అదే విధంగా హైదరాబాద్, వైజాగ్ లో కంటే కర్నూల్ లో ఫంక్షన్ ను చేయడం వల్ల ఖర్చు కూడా చాలా వారికీ తగ్గుతుంది అని ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నారట. అందుకే అక్కడే అందరూ ఈ ఫంక్షన్లు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది అంటున్న తిలక్ వర్మ..!

నేను ఆడితే భారత్ ప్రపంచ కప్ గెలిచేది కాదు..!

Visitors Are Also Reading