Home » క‌ల్యాణ్ దేవ్ సినిమాకు క‌రువైన మెగా స‌పోర్ట్..ఎందుక‌లా?

క‌ల్యాణ్ దేవ్ సినిమాకు క‌రువైన మెగా స‌పోర్ట్..ఎందుక‌లా?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ల్యాణ్ దేవ్ 2018లో విజేత సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది. చాలా మందికి ఈ సినిమా వ‌చ్చి పోయిన‌ట్టు కూడా తెలియ‌దు. ఇక ఈ సినిమా త‌ర‌వాత క‌ల్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తున్న మ‌రో సినిమా సూప‌ర్ మ‌చ్చి ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో క‌ల్యాణ్ దేవ్ కు జోడీగా రుచితా రామ్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ చిత్రంలో పోసోని క్రిష్ణ‌మురళి స‌హా ప‌లువురు న‌టులు కీల‌క పాత్రల్లోన‌టించారు.

kalyan dev

kalyan dev

ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌కటించింది. సినిమా టీజ‌ర్ మ‌రియు కొన్ని పాట‌ల‌ను కూడా విడుద‌ల చేసారు. ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లు పెట్టారు. అయితే సాధార‌ణంగా మెగాఫ్యామిలీ నుండి సినిమా వ‌స్తుందంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ క‌ల్యాణ్ దేవ్ సినిమాకు అలాంటి క్రేజ్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ నుండి కూడా క‌ల్యాణ్ దేవ్ కు స‌హ‌కారం అందుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ లాంచింగ్ ఏ రేంజ్ లో జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే.

Advertisement

Advertisement

also read : ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో రూ.25 కోట్లు వృథా..!

మెగా స్టార్ ఈ సినిమా ఫంక్ష‌న్లలో సంద‌డి చేసి స‌పోర్ట్ ఇచ్చారు. కేవ‌లం మెగాస్టార్ మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ నుండి ప‌లువురు స‌పోర్ట్ ఇచ్చారు. ఎలాంటి సంబంధం లేని హీరోల టీజ‌ర్ లు ట్రైల‌ర్ ల‌ను సైతం స‌పోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోలు సినిమాకు హైప్ తీసుకువ‌స్తారు. కానీ క‌ల్యాణ్ దేవ్ విష‌యం లో అలాంటి కనిపించ‌డం లేదు. సూప‌ర్ మ‌చ్చి సినిమా మ‌రో వారంలో విడుద‌లకు సిద్దంగా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కూ మెగా ఫ్యామిలీ నుండి ఒక్క‌రు కూడా ప్ర‌మోష‌న్స్ చేయ‌కపోవ‌డం విడ్డూరం. ఇదిలా ఉంటే క‌ల్యాణ్ దేవ్ శ్రీజ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే క‌ల్యాణ్ దేవ్ ను ప‌క్క‌న పెట్టార‌నే వార్త‌లు కూడా సోష‌ల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.

Visitors Are Also Reading