Home » టీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..!

టీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..!

by Anji
Ad

పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కాలానికి తగ్గట్టు ఉండాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఒకలా ఉంటే మరికొన్ని సందర్భాల్లో మరోలా ఉంటాయి. ఉదాహరణకు మొన్న జరిగిన ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ పై అంత చెత్తగా ఓడి పోతుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు. బౌలింగ్ సహకరించకపోవడం వల్లనే ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఇలా ఓడిపోవడంతో కేవలం ఆటగాళ్లపైనే కాదు.. కోచ్, యాజమాన్యంపై  కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  క్రీడా ప్రపంచంలో మిస్టర్ వాల్ గా పేరు గాంచిన రాహుల్ ద్రవిడ్ టీ20 లకు కోచ్ గా ఎందుకు ? జట్టు వెంట మెంటర్ గా టెస్ట్ బ్యాట్స్ మెన్ ఎందుకు ? అంటూ సగటు క్రీడాభిమానులు పలు ప్రశ్నలను సంధిస్తున్నారు.

Advertisement

ద్రవిడ్, లక్ష్మణ్ క్రీడా దిగజాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ టీ20లకు దూకుడు అయిన ఆట, బౌలర్లకు ఎదురుదాడికి దిగేవారు ఉంటేనే నెగ్గుకు రాగలం. అదేవిధంగా పదునైన బౌలింగ్ కూడా చాలా అవసరమే. అలాంటి వారిలో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారు కోచింగ్ గా ఉంటే బ్యాట్స్ మెన్ కి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు.  టోర్నీలలో గెలవగలం అంటున్నారు. క్రికెట్ చరిత్రలో అత్యంత డేంజరస్ బ్యాట్స్ మెన్ గా తన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడనే చెప్పవచ్చు. ఇక టీ 20 లకు ఇంతకన్న ఎక్కువ ఏం కావాలి. టెస్ట్ లను టీ20లుగా, వన్డేలను టీ 10గా ఆడిన ఘనత వీరేంద్రుడిది. బౌలర్లను ఆదిలోనే ఊచకోత కోస్తే.. వారు ఆత్మ రక్షణలో పడతారు.

Advertisement

జట్టు మరింతగా స్కోరు చేయడానికి వీలుంటుంది. ఇదే సెహ్వాగ్ మైండ్ సెట్. అందుకు తగినట్టుగానే సెహ్వాగ్ ఆడుతాడు. అలాంటి మైండ్ సెట్ ఉంటే కచ్చితంగా టీ 20 ప్రపంచ కప్ లు ఎన్ని అయినా కొట్టగలమంటున్నారు. రాహుల్ ద్రవిడ్ లాంటి టెస్ట్ బ్యాటర్ ని కోచ్ గా తెచ్చి బీసీసీఐ తప్పు చేసింది అంటున్నారు క్రికెట్ అభిమానులు. ఒక వ్యక్తి మెండ్ సెట్ ఎలా ఉంటే అతని ఆట అలా ఉంటుంది. ప్రపంచ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఆడిన విధానం చూస్తే.. టెస్ట్ బ్యాటింగ్ ను తలపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేె.ఎల్. రాహుల్, రోహిత్ శర్మ పవర్ ప్లేలో పరుగులు చేయడం పక్కన పెడితే.. ఫాస్ట్ బౌలింగ్ లో భయపడకుండా ఆడడం వారికి గగనం అయింది. పాకిస్తాన్ జట్టు ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా వెంటరన్ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుని అద్భుతాలు చేస్తోంది. హెడెన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం హెడెన్ పాకిస్తాన్ ఆటగాళ్లలో ఇప్పుడు ఇదే నింపాడు.

Also Read :  ఇండియా ఆటగాళ్లకు ఆ స్వేచ్ఛ ఇవ్వం..!

Veerendra Sehwag : Manam News

మరోవైపు ఫైనల్ కి వెళ్లిన ఇంగ్లాండ్ జట్టునే తీసుకుంటే.. న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ బ్రెండన్ మెకల్లామ్ పాఠాల్లో రాటుతేలిన ఇంగ్లీషు ఓపెనర్లు.. పవర్ ప్లేలో ఎలా పరుగులు చేస్తున్నారో మనం మొన్న జరిగిన మ్యాచ్ లోనే చూశాం. ఈ ప్రపంచ కప్ లో పవర్ ప్లే లో  అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏ ఫార్మాట్ కి తగ్గట్టు ఆ ఫార్మాట్ వారిని కోచ్ గా నియమిస్తే ఫలితాలు వాటంతటా అవే వస్తాయి. టెస్ట్, వన్డేలకు సరిపోయే వారి ఆలోచనలు, టీ 20లకు ఎంత మాత్రం పనికి రావన్నది జగమెరిగిన సత్యం. టీ 20ల్లో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడితేనే రాణించగలుగుతారు. ఇప్పటికైనా బీసీసీఐ కళ్లు తెరిచి టీ 20లకు కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ని తీసుకుంటే.. రాబోయే రోజుల్లో అయినా భారత జట్టు ప్రపంచ కప్ కొట్టే ఛాన్స్ ఉంటుందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇక ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Also Read :  ఇండియా సెమీస్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఏం అవుతుంది..?

 

Visitors Are Also Reading