Home » పెద్ద‌వారి పాదాల‌కు న‌మస్కారం ఎందుకు చేస్తారో తెలుసా?

పెద్ద‌వారి పాదాల‌కు న‌మస్కారం ఎందుకు చేస్తారో తెలుసా?

by Bunty
Ad

మ‌నం ఎంత పెద్దగా ఎదిగినా.. మ‌న‌కన్న పెద్ద వాళ్లు క‌నిపిస్తే.. వాళ్లుకు న‌మస్కారం చేస్తాం. అలాగే చాలా పెద్ద‌లు అయితే కాళ్లకు కూడా న‌మ‌స్క‌రిస్తాం. అయితే అత్య‌ధునిక నాగ‌రిక‌త వ‌చ్చిన ఈ ప‌ద్ద‌తిని మ‌నం మ‌ర్చిపోలేం. అయితే ఈ ప‌ద్ద‌తి అనేది హిందూ సంప్ర‌దాయం నుంచి వ‌చ్చింది. హిందూ సంప్ర‌దాయంతో నే మ‌న కన్న పెద్ద‌లు అయిన త‌ల్లి దండ్రుల‌కు, గురువులు, తాతాయ్య‌లు, అమ్మ‌మ్మ‌లు, నాన‌మ్మ‌లు వంటి వారి కాళ్లకు న‌మ‌స్కారం చేస్తాం. అలాగే మ‌నం ఎదైనా ముఖ్య మైన ప‌ని కోసం వెళ్లిన సంద‌ర్భాల‌ల్లోనూ ఇంట్లో ఉన్న పెద్ద‌ల పాద‌లకు న‌మ‌స్కారం చేసి బ‌య‌లుదేరుతాం.

Advertisement

Advertisement

అయితే మ‌నం పెద్ద వాళ్ల క‌ళ్లకు ఎందుకు న‌మ‌స్కారం చేస్తామో ఎప్పుడు అయినా ఆలోచించారా..? అయితే మ‌నం పెద్ద వాళ్ల పాదాల‌కు ఎందుకు న‌మ‌స్కారం చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న కంటే పెద్ద వాళ్ల కాళ్ల‌కు న‌మస్కారం చేయ‌డం అనే ప‌ద్ద‌తిని మ‌హా భార‌తం కాలం నుంచి ఎక్కువ గా వ‌స్తుంది. పెద్దల కాళ్ల‌కు న‌మ‌స్కారం చేయాల‌ని మ‌హా భార‌తంలో ఉంటుంది. అప్ప‌టి నుంచి ఈ ప‌ద్ద‌తి ముఖ్య మైన సంప్ర‌దాయంగా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌స్తుంది. కాగ ఈ సంప్రదాయాన్ని మొట్ట‌ మొదట మహాభారతంలో ధర్మరాజు ప్రారంభించాడు. అయితే మ‌న కంటే పెద్ద వారికి పాదాల‌కు న‌మ‌స్కారం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఒక రక‌మైన శ‌క్తి వ‌స్తుంది. శ‌క్తి అంటే ఇక్కడ పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.

అంటే మ‌న క‌న్న పెద్ద వాళ్ల కాళ్ల‌కు న‌మ‌స్కారం చేసిన స‌మ‌యంలో వారు మ‌నల్నీ ఆశీర్వ‌దిస్తారు. దీంతో మ‌న‌కు పెద్ధ వాళ్ల ఆశీర్వాదం ఉంద‌ని ఒక గొప్ప అనుభూతి వ‌స్తుంది. ఈ అనుభూతితో మ‌నం ఎదైనా.. సాధిస్తామ‌నే న‌మ్మ‌కం వ‌స్తుంది. అలాగే మ‌న పై పెద్ద వాళ్ల‌కు మంచి భావ‌న వ‌స్తుంది. దీంతో వారితో మ‌న‌కు మంచి సంబంధాలు ఏర్పాడుతాయి. అలాగే మ‌నం కాళ్లకు న‌మ‌స్కారం చేస్తున్న స‌మ‌యంలో వంగుతాము. దీంతో కొంత వ‌ర‌కు వ్యాయ‌మం చేసిన‌ట్టు కూడా అవుతుంది.

read more.. చైనా వాళ్లు క్రికెట్ ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం తెలుసా?

Visitors Are Also Reading