దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా విడుదలైనప్పటి ఇప్పటి వరకు ఏదో ఒక రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఇటీవల ఈ చిత్రానికి, ఇందులో నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుందని హాలీవుడ్ మీడియాలో పలు కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ భారత్ నుంచి ఈ చిత్రం ఎంపిక కాకపోవడం గమనార్హం.
Advertisement
హాలీవుడ్ నటులు అయితే జీవితంలో ఒక్కసారి అయినా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటుంటారు. ఈ ఏడాది మనదేశం తరుపున ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ నామినేట్ కాకుండా దాని స్థానంలో ‘చల్లో షో’ ఎంపిక అయింది. దీనిపై నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్పందించారు.
Advertisement
Also Read : పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో తెలుసా ?
RRR
గతంలో తాను నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కోసం పరిశీలనకు వెళ్లింది. చివరికి అది ఆస్కార్ నామినేషన్ దక్కించుకోలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా అలా కాదు కదా.. ఈ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలను దక్కించుకొంది. ప్రేక్షకుల స్పందనకు మించిన అవార్డు ఏది లేదని చెప్పుకొచ్చారు రష్మిక. ఆస్కార్ అవార్డులు రావాలంటే కొలమానాలు ఏంటనే విషయంపై కూడా ఓ క్లారిటీ లేదని చెప్పుకొచ్చింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ సినీ పత్రికలు కూడా ప్రశంసలు కురిపించడం విశేషం. కానీ చివరికీ భారత్ ఈ సినిమాను నామినేట్ చేయలేదు.
Advertisement
Also Read : దీపికా,రణవీర్ విడాకులు తీసుకోబోతున్నారా..?