Home » ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా నుంచి చిరంజీవిని తీసేసి మోహన్ బాబు ఎందుకు ఎన్టీఆర్ పెట్టారు ? చిరు చేసిన తప్పు..!

ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమా నుంచి చిరంజీవిని తీసేసి మోహన్ బాబు ఎందుకు ఎన్టీఆర్ పెట్టారు ? చిరు చేసిన తప్పు..!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక పేరు కాదు అదో బ్రాండ్ అనే విధంగా చిరు క్రేజ్ ను సంప్ర‌దించుకున్నారు. త‌న స్టైల్, డ్యాన్స్ ల‌తో మెగాస్టార్ అభిమానుల‌ను క‌ట్టిప‌డేశాడు. కెరీర్ ప్రారంభంలో సైడ్ పాత్ర‌లు చేసి ఆ త‌ర‌వాత త‌న టాలెంట్ తో ఏకంగా హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా వ‌రుస స‌క్సెస్ లు అందుకుంటూ చివ‌రికి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. తాను ఎద‌గ‌ట‌మే కాకుండా చిత్రప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తూ వారి ఎదుగుద‌ల‌కు కూడా మెగాస్టార్ కార‌ణం అయ్యాడు.

Advertisement

మెగాస్టార్ కెరీర్ లో దాదాపు 80శాతం వ‌ర‌కూ హిట్లే ఉన్నాయి. ఒక హీరోకు ఎన‌భై శాతం వ‌ర‌కూ హిట్లు ఉండ‌టం అంటే అంత ఈజీ కాదు. అంతే కాకుండా మెగాఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. ఇదిలా ఉంటే మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు కూడా ఉన్నాయి. ఇక మెగాస్టార్ త‌న కెరీర్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూప‌ర్ స్టార్ కృష్ణ లాంటి సీనియ‌ర్ హీరోల‌తో కలిసి న‌టించారు.

Advertisement

మెకానిక్ అల్లుడు సినిమాలో చిరంజీవి ఏఎన్ఆర్ క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా న‌టించిన తిరుగులేని మ‌నిషి చిత్రంలో కూడా చిరంజీవి ముఖ్య‌మైన పాత్ర‌లో ఎన్టీఆర్ బావ‌మ‌రిదిగా న‌టించి అల‌రించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ హీరోగా న‌టించిన కొండవీటి సింహం సినిమాలో కూడా మొట‌ద చిరంజీవిని హీరోగా తీసుకున్నారు. ఎన్టీఆర్ కు ఎదురుతిరిగే పాత్ర అది. ఐదు రోజుల పాటూ చిరంజీవిపై షూటంగ్ కూడా చేశారు. అయితే చిరంజీవి న‌టించే స‌మ‌యంలో ఎన్టీఆర్ కు ఎదురుతిరిగి డైలాగులు చెప్పే స‌మ‌యంలో త‌డ‌బ‌డ్డార‌ట‌.

దానికి కార‌ణం ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో తిరుగులేని మ‌నిషి…నటుడిగా చాలా సీనియ‌ర్ కానీ చిరు అప్పుడప్పుడే ఇండ‌స్ట్రీలో ఎదుగుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఆ సినిమా కోసం నెల‌రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు. దాంతో చిరంజీవి చేస్తే షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని భావించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మోహ‌న్ బాబును ఆ పాత్ర కోసం తీసుకున్నారు. అలా మోహన్ బాబుకు కొండ‌వీటి సింహంలో చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాలో మోహ‌న్ బాబు ఎన్టీఆర్ కు స‌మానంగా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటారు. ఈ చిత్రం అప్ప‌ట్లో మంచివిజయం సాధించింది.

ALSO READ :

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్లోజ్ పిక్ ను షేర్ చేసిన స‌మంత‌…క‌పుల్స్ అంటూ నెటిజ‌న్ల వింత రియాక్ష‌న్స్…!

ప్రేమదేశం సినిమాతో యూత్ ను ఊపేసిన అబ్బాస్…ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు..ఏం చేస్తున్నాడో తెలుసా…!

Visitors Are Also Reading