Home » చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోని సినిమాలు..!

చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోని సినిమాలు..!

by Sravya
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ కి చాలా మంది వస్తుంటారు. ఎంతోమంది హీరోలు అయ్యారు కూడా. మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇంత పెద్ద స్టార్ హీరో అయిపోయారు. పైగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు కూడా రావడం మనం చూసాము.

chiranjeevi-and-venkatesh-photos

chiranjeevi-and-venkatesh-photos

చిరంజీవి కుటుంబం నుండి అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ ఇలా వీళ్లంతా కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.

Advertisement

చిరంజీవిని నిర్మాతల మనిషి అంటారు చిరంజీవి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తారు. చిరంజీవి ఇతరుల కష్టం గురించి కూడా అర్థం చేసుకునే మనిషి సినిమాలకి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చి కుర్ర హీరోల్లాగ తన జోష్ ని చూపిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు చిరు. చిరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ సినిమా చేశారు. ఆ తర్వాత సైరా సినిమాలో నటించారు. చిరంజీవి క్రేజీ కాంబోలో ఆచార్య సినిమా కూడా చేశాడు. ఆచార్య సినిమా మాత్రం బోల్తా కొట్టింది అనుకున్నంత ఫలితం రాలేదు. దాంతో చిరంజీవి ఒక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

సాధారణంగా చిరంజీవి రెమ్యూనరేషన్ అంటే ఓ లెక్కలో ఉంటుంది కానీ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని వాళ్ళకి కష్టం కలగకూడదని చిరంజీవి తను ఒప్పుకున్న సినిమాలకు ఏ సినిమాలకి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆచార్య ఫలితంతో తను ఒప్పుకున్న సినిమాలకు ఏమీ కూడా రెమ్యూనరేషన్ తీసుకోకూడదని సినిమాకి వచ్చే లాభాలు బిజినెస్ ని బట్టి తను డబ్బులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బయ్యర్స్ కి నిర్మాతలకి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయాన్ని చిరు తీసుకున్నారు.

Also read:

Visitors Are Also Reading