ప్రతి కులానికి, మతానికి స్వంత ఆచార వ్యవహారాలు ఉంటాయి. అయితే.. హిందువులలో మాత్రం ఆహారాలకు సంబంధించి కూడా ఆచారాలు ఉంటాయి. హిందువులలో బ్రాహ్మణులు, ఆర్య, వైశ్యులు మొదలగువారు చాలా మంది మాంసాహారం ముట్టరు. ఇక, బ్రాహ్మణులలో అయితే చాలా మంది కనీసం ఉల్లి, వెల్లుల్లిని కూడా తమ ఆహారంలో భాగం చేసుకోవడానికి ఇష్టపడరు.
Advertisement
నిజానికి ఉల్లి, వెల్లుల్లి అనేవి శాకాహారం కిందకే వస్తాయి. ఇవి మొక్కలకే పండించబడతాయి. అయినప్పటికి.. వీటిని బ్రాహ్మణులు దూరం పెడుతూ ఉంటారు. ఉల్లి లేని కూరలను ఈ మధ్య కాలంలో ఎవరూ తినడం లేదు. అలాంటి ఉల్లిపాయని సైతం కొంతమంది బ్రాహ్మణులు దూరం పెట్టడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లి, వెల్లుల్లి అనేవి తామస గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని తింటే నోరంతా ఎక్కువ సేపు అదే వాసన ఉండిపోతుంది.
Advertisement
అందుకే వీటిని సాత్విక ఆహారం కింద పరిగణించరు. ఈ ఆహారాన్ని బ్రాహ్మణులు దూరం పెడుతూ ఉంటారు. ఎందుకంటే.. బ్రాహ్మణుల్లో కొందరు వృత్తిరీత్యా వేదం పారాయణం, మంత్రోచ్ఛారణ చేస్తూ ఉంటారు. వారి వాక్కు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రజో, తమో గుణాలను కలిగించే ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు అందుకే తమ ఆహారంలో తీసుకోరు.
సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!
విక్టరీ వెంకటేష్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడా..?
ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న గోపీచంద్…కానీ !