Telugu News » Blog » అక్కినేని కోడలు అమల నగలు ఎందుకు వేసుకోరో మీకు తెలుసా…?

అక్కినేని కోడలు అమల నగలు ఎందుకు వేసుకోరో మీకు తెలుసా…?

by Manohar Reddy Mano
Ads
అక్కినేని కోడలు అమల గురించి టాలీవుడ్ లో తెలియని వారు ఉండరు. 1987 లో నాగార్జున హీరోగా వచ్చిన కిరాయి దాదా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనా అమల ఆ తర్వాత మళ్ళీ నాగార్జునతోనే కలిసి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె సినిమా జీవితంలో వెన్నకి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాలు సూపర్ హిట్ సినిమాలు చేసిన 1992 లో హీరో అక్కినేని నాగేశ్వర్ రావు వారసుడు నాగార్జునను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.
అయితే అక్కినేని ఫ్యామిలీ అంటే మన టాలీవుడ్ లో ఎంత రేంజ్ ఉంచి అనేది అందరికి తెలుసు. డబ్బుకు గాను మర్యాదకు గాను ఆ ఫ్యామిలీ ఎక్కడ తీసిపోదు. అటువంటి కుటుంబం లోకి కోడలుగా వచ్చిన తర్వాత కూడా అమల చల్ల సింపుల్ గా ఉంటారు. మామూలుగానే ఈ రోజులో డబ్బు ఉన్నవారు లక్షలు విలువ చేసే చీరలు, పెద్ద పెద్ద నగలు వేసుకొని బయటకి వస్తుంటారు. కానీ అమల మాత్రం ఎప్పుడు నగలు వేసుకొని అభిమానులకు కనిపించలేదు. అయితే అమల ఎందుకు నగలు వేసుకోదు అనే విషయాన్ని ఆమెకు దగ్గరగ అండ్ ఓ వ్యక్తి వెల్లడించారు.
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అమల గారు చాలా సింపుల్ గ అందటానికి ఇష్టపడుతారు. సిల్క్ చీరలు ఆమె కట్టారు. అలాగే లెదర్ వాడారు. అదే విధంగా నగలు అసలు పెట్టుకోరు. ఎప్పుడైనా సినిమాలో నటించడానికి మినహా ఆమె ఇంట్లో గాని బయట మాములుగా గాని నగలు అసలు వేసుకోరు. సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతారు అని ఆయన తెలిపారు. అయితే ఈ మధ్య సినిమాలో నటించడం చాలా వరకు తగ్గించిన అమల ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆమెకు జంతులు అంటే ఇష్టం అనే విషయం చాలా మందికి తెలిసిందే.