టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో వస్తున్నారు కానీ అప్పట్లో ఐదుకు పైగానే సినిమాలను విడుదల చేశారు. నాగార్జున 2000 సంవత్సరం నుండి 2002 మధ్యన ఏకంగా ఆరు సినిమాలు విడుదల చేశాడు. వాటిలో నిన్నేప్రేమిస్తా, అధిపతి, నువ్వువస్తావని, ఆజాద్, ఎదరులేని మనిషి, స్నేహమంటే ఇదేరా సినిమాలతో వచ్చాడు.
వీటిలో నిన్నే ప్రేమిస్తా, నువ్వస్తావని తప్ప మిగతా సినిమాలు అనుకున్నమేర విజయం సాధించలేకపోయాయి. అదే సమయంలో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పవన్ కల్యాణ్ వచ్చి యూత్ ను ఉర్రూతలూగించాడు. దాంతో నాగార్జున ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. మళ్లీ ఎలాగైనా సూపర్ హిట్స్ తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. కట్ చేస్తే నాగ్ 2002లో సంతోషం, మన్మథుడు అంటూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఆ తరవాత శివమణితో మాస్ హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక వరుస హిట్లతో ఉన్న నాగార్జున వద్దకు లారెన్స్ కూడా ఓ కథతో ముందుకు వచ్చాడు. నాక్కూడా ఓ అవకాశం ఇవ్వాలంటూ నాగ్ ను కోరాడు. కథ నచ్చకపోతే మళ్లీ ఎప్పుడూ అడగను అని చెప్పాడు. దాంతో కొత్తవారికి అవకాశాలు ఇచ్చే నాగార్జున ఆ కథను విన్నాడు. అదే మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ వద్ద దడ పుట్టించాడు. తన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించాడు.
ఈ సినిమాలో ఛార్మి మరియు భూమికలు నటించారు. అంతే ఈ సినిమా కథను ముందుగా లారెన్స్ రజినీకాంత్, చిరంజీవిలకు వినిపించారట. తమిళ హీరో విజయ్ కి కథ చెప్పాలనుకున్న లారెన్స్ ముందుగా నాగ్ కు వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా నాగ్ రిస్క్ చేయడంతో సూపర్ హిట్ అతడినే వరించింది.