Home » ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

by Bunty

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు చాలా లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ప్రేమ వివాహాలు మరీ ఎక్కువైపోయాయి. అయితే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేవారు ప్రభాస్, అనుష్క. నాలుగుపదుల వయసు దాటినప్పటికీ వీరిద్దరూ ఇంకా పెళ్లిపీటలు ఎక్కలేదు. ఆ మధ్యలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వీరి పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పుడు ఖండించలేదు. దీంతో ఈ వార్తలు నిజమని అనుకున్నారు ప్రేక్షకులు.

వీరిద్దరి జంట కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పటికీ వీరి పెళ్లి జరగకూడదని కృష్ణంరాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారట. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని కృష్ణంరాజు చివరి కోరిక అయినప్పటికీ కూడా అనుష్కను చేసుకోవడానికి కృష్ణంరాజు ఒప్పుకోలేదట. దీనికి కారణం ప్రభాస్ జాతకం అనుష్క జాతకం కలవలేదట. అంతేకాకుండా అనుష్క జాతకంలో కుజదోషం కూడా ఉందని కృష్ణంరాజు వద్దని చెప్పాడట. అందువల్లనే ప్రభాస్, అనుష్క పెళ్లి జరగకూడదని కృష్ణంరాజు చెప్పాడట. కానీ ప్రభాస్ మాత్రం అనుష్కను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడట.

ఇక దురదృష్టవశాత్తు కృష్ణంరాజు గారు ఈ మధ్య కన్నుమూసిన సంగతి మన అందరికీ తెలిసిందే. తన చివరి కోరిక ప్రభాస్ కి పెళ్లి జరగాలి తన పిల్లలతో నేను ఆడుకోవాలని ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గారు చెప్పారు. ఈ కోరిక తీరకుండానే ఆయన మరణించడం చాలా బాధాకరం. ఇక తాజాగా జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ…. త్వరలోనే తిరుమలలో పెళ్లి చేసుకుంటానని చెప్పరు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు…ఎప్పుడూ అనే విషయాలు ఏవి తెలియ రాలేదు. ఈ విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

రైల్వే స్టేషన్ మాస్టర్ జీతం, లభించే సదుపాయాల గురించి తెలుసా?

Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

Visitors Are Also Reading