Home » ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంది…? డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంది…? డబ్ల్యూహెచ్ఓ ఆసక్తికర వ్యాఖ్యలు..!

by AJAY
Ad

ప్రస్తుతం దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో త్వరలోనే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని పలువురు ఆరోగ్య నిపుణులు సూచించారు. అయితే తాజాగా కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఎన్నో ఆధారాలు తెలియజేస్తున్నాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. రెస్పిరేటరీ ట్రాక్ (శ్వాస వ్యవస్థ) లో పై భాగంలో ప్రభావం చూపిస్తోందని గత రకాలతో పోలిస్తే లక్షణాలను తక్కువ కలిగిస్తుందని పేర్కొంది.

Advertisement

corona omricon

corona omricon

ఫలితంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గతం లో వచ్చిన కరోనా డెల్టా తో ఊపిరితిత్తులలో తీవ్రమైన న్యూమోనియా ఏర్పడిందని కానీ ఓమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగం పై ప్రభావితం అవుతోందని పేర్కొంది.

Advertisement

ఇది ఆనందించాల్సిన విషయం అయినప్పటికీ దీనిని నిర్ధారించేందుకు మరి కొన్ని ఆధారాలు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆస్పత్రిలో చేరడం మరణాలను నివారించడమే మన ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని డబ్లు హెచ్ ఓ పేర్కొంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో కేసులు వేగంగా పెరుగుతాయని ఫలితంగా ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్య కొరత ఏర్పడే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.

Visitors Are Also Reading