Telugu News » ధ‌నుష్ భార్య‌తో విడాకులకు.. ఆ క‌థానాయిక‌నే కార‌ణమా..?

ధ‌నుష్ భార్య‌తో విడాకులకు.. ఆ క‌థానాయిక‌నే కార‌ణమా..?

by Anji

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, ర‌జ‌నికాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌తో విడాకులు ప్ర‌క‌టించడంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ధ‌నుష్ ఐశ్వ‌ర్య‌కు విడాకులు ఇవ్వ‌డానికి కార‌ణాలు ఇవే అంటూ మీడియాలో ప‌లు క‌థ‌నాలు రావ‌డంతో ఇప్పుడు వైర‌ల‌వుతున్నాయి.

Ads

ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వ‌య‌స్సులో త‌న‌కంటే రెండేండ్లు చిన్న వాడు అయినప్ప‌టికీ ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ప్రేమ‌కు అడ్డుకాలేదు. కానీ వారి ప్రేమ వివాహానికి ధ‌నుష్ అఫైర్లు, అక్ర‌మ సంబంధాలు అడ్డుగా నిలిచాయ‌ని మీడియాల్లో ప‌లు క‌థ‌నాలు వెల్ల‌డ‌య్యాయి. ధ‌నుష్ వ్య‌వ‌హారం శైలిపై విసిగిపోయిన ఐశ్వ‌ర్య విడాకుల‌కు మొగ్గు చూపిన‌ట్టు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Dhanush Controversies: Amala Paul sometimes associated with Shruti Haasan,  Dhanush's name, know when - when did he come in the headlines?

ఐశ్వ‌ర్య కాపురంలో క‌ల‌త‌లు రావ‌డానికి కార‌ణం శృతిహాస‌న్ అనేది ప్ర‌ధానంగా వినప‌డుతుంది. శృతి, ఐశ్వ‌ర్య చిన్ననాటి స్నేహితులు. భ‌ర్త ధ‌నుష్‌, స్నేహితురాలు శృతిహాస‌న్ జంట‌గా 3 చిత్రం ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలుగా కోలీవుడ్ రంగ ప్ర‌వేశం చేసింది. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ధ‌నుష్‌, శృతిహాస‌న్ మ‌ధ్య అఫైర్ జోరుగా సాగింద‌ని వార్త‌లు మీడియాలో షికారు చేసాయి. ధ‌నుష్ అఫైర్ కార‌ణంగానే కుటుంబంలో క‌ల‌త‌లు చోటు చేసుకుని విడాకుల వ‌ర‌కు వ‌చ్చాయ‌ని పేర్కొంటున్నారు.

Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards | Bollywood News –  India TV

అయితే ధ‌నుష్‌తో అఫైర్ వార్త‌ల‌ను మాత్రం శృతిహాస‌న్ ఖండించారు. నా వ్య‌క్తి గ‌త జీవితంతో ముడిప‌డి ఉన్న రూమ‌ర్ల‌కు న్యాయం చేయ‌లేను. నిజం తెలుసుకోవ‌డానికి నా దేహంలో మైక్రో చిప్ పెట్టి.. న‌న్ను ఫాలో అవ్వండి చెప్ప‌లేను. ఒకే ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాం.. క‌లిసి ప‌ని చేస్తున్నాం. ధ‌నుష్ నాకు మంచి స్నేహితుడు. ప్రొఫెష‌న‌ల్ నాకు బాగా హెల్ప్ చేసాడు. మా గురించి ఏదో గాలి మాట‌లు మాట్లాడుకుంటున్నార‌ని, నా స్నేహాన్ని వ‌దులుకోన‌ని శృతి చెప్పారు.

Shruti Haasan on celebs holidaying during pandemic: 'Don't throw your  privilege in people's faces' | Bollywood - Hindustan Times

ధ‌నుష్ గురించి మాట్లాడుకున్న నేను ప‌ట్టించుకోను. నా గురించి 10వేల రూమ‌ర్లున్నా.. నేను ప‌ట్టించుకోను. 3 సినిమా స‌మ‌యంలో ధ‌నుష్ నాకు ఇచ్చిన స‌పోర్ట్ మాట‌ల్లో చెప్ప‌లేను. అందుకు ఆయ‌న‌కు నేను రుణ‌ప‌డి ఉంటాను. ధ‌నుష్‌, నా రిలేష‌న్ గురించి ఏమ‌నుకున్నా పట్టించుకోను అని అప్ప‌ట్లోనే మీడియాకు వివ‌రించింది శృతి.

Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards | Bollywood News –  India TV

శృతి హాసన్ తర్వాత అమలాపాల్‌తో ధనుష్‌ అఫైర్ వార్త అత్యంత దుమారమే లేపింది. దర్శకుడు ఏఎల్ విజయ్‌, అమలాపాల్ 2017లో విడాకులు తీసుకున్నప్పడు అందుకు కారణం ధనుష్ అనే వార్త కూడా వినిపించింది. మా బంధంలో నమ్మకం లేకపోవడం వల్లనే దాంపత్య జీవితం విఫలమైందని ఏఎల్ విజయ్ చెప్పారు. అమ‌ల‌పాల్ త‌న కొడుకు ఏ.ఎల్‌. విజ‌య్‌ విడిపోవ‌డానికి కార‌ణం ధ‌నుష్ అంటూ విజ‌య్ తండ్రి అజ‌గ‌ప్ప‌న్ వెల్ల‌డించారు. అమ‌లాపాల్‌కు ధ‌నుష్ అమ్మ క‌న‌క్కు అనే సినిమా ఆఫ‌ర్ ఇచ్చారు. ఆ చిత్రంలో న‌టించాల‌ని అమ‌లాపాల్ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే త‌న కొడుకు కాపురంలో నిప్పులు పోసింద‌ని చెప్పారు.

Dhanush Behind The Divorce! Amala Paul Clarifies

ఇలాంటి రూమ‌ర్ల మ‌ధ్య‌న ఐశ్వ‌ర్వ‌తో విడిపోతున్న‌ట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ధ‌నుష్ పోస్ట్ చేశారు. గ‌త 18 సంవ‌త్స‌రాలుగా స్నేహితులు, భార్య‌భ‌ర్త‌లు, త‌ల్లిదండ్రులుగా, ఒక‌రికి ఒక‌రం స‌న్నిహితుల‌గా ప్ర‌యాణం సాగిస్తూ.. మా మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు, అవ‌గాహ‌న స‌ర్దుబాట్లు చోటు చేసుకున్నాయి. కానీ మేము క‌లిసి జీవించ‌లేం అనే ఐశ్వ‌ర్య‌, నేను భార్య‌భ‌ర్త‌లుగా విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. మా నిర్ణ‌యాన్ని మీరు గౌర‌విస్తారు అని, మా ప్రైవ‌సీని అర్థం చేసుకుంటార‌ని.. ఓం న‌మ‌శ్చివాయ‌.. ప్రేమ‌తో అంటూ.. పోస్ట్ చేసారు.


You may also like