Home » ఆ స్టార్ హీరోకు కథ చెప్పి.. వెంకటేష్ తో సినిమా తీసి.. జైలుకు వెళ్లిన నిర్మాత ఎవరంటే..!!

ఆ స్టార్ హీరోకు కథ చెప్పి.. వెంకటేష్ తో సినిమా తీసి.. జైలుకు వెళ్లిన నిర్మాత ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala

చిత్ర రంగంలో ఎగ్జిక్యూటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగానూ మూడు రంగాల్లో విశేషమైన అనుభవం సంపాదించిన ఒకే ఒక వ్యక్తి కె.వి.వి.సత్యనారాయణ. ఆయన ఒకసారి మద్రాసు వెళ్లినప్పుడు రజనీకాంత్ సినిమా అన్నమలై చూశారు. ఆ సినిమా ఆయనకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడింది. ఎక్కువ డబ్బులు పెట్టి మరీ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను చిరంజీవితో తీయాలని సత్యనారాయణగారే అనుకున్నారు. చిరంజీవికి కథ వినిపించారు సత్యనారాయణ. ఆ కథ బాగా నచ్చడంతో చిరంజీవి కూడా చేస్తానని మాట ఇచ్చారు. అయితే హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నేరుగా సుందరకాండ షూటింగ్ ప్లేస్ కి వెళ్లారు. అన్నమలై రీమేక్ హక్కులను కొన్నారని తెలుసుకున్న వెంకటేష్ ఆ సినిమా కూడా మనమే చేద్దామని అనడంతో సత్యనారాయణగారు షాకయ్యారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వెంకటేష్ గారి తోనే కంటిన్యూ అయ్యారు. చిరంజీవితో సినిమా తీసే అవకాశం పోయినా కూడా వెంకటేష్ తో ఒకే సంవత్సరం రెండు సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు సత్యనారాయణగారు. ఒక నవల ఆధారంగా 1987 హిందీలో ఉదాగస్ సినిమా రూపుదిద్దుకుంది. ఆ సినిమా ఆధారంగానే 1988లో ప్రాణ స్నేహితులు చిత్రాన్ని నిర్మించారు కృష్ణంరాజు.ఉదాగస్ ఆధారంతోనే తమిళంలో అన్నమలై సినిమా రూపుదిద్దుకొంది. 1993 జూన్ 9న కొండపల్లి రాజా సినిమాని విడుదల చేయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే హీరో కృష్ణంరాజు ఆ కథ తనది అంటూ కోర్టులో కేసు వేశారు . రిలీజ్ అయిన మరుసటి రోజే ప్రింటర్ల ను సీజ్ చేయమని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. నిర్మాత సత్యనారాయణ దాదాపు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాని నుంచి బయటపడి సినిమాను విడుదల చేయడానికి ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా విజయం సాధించింది అన్న ఆనందం కూడా ఆయనకు మిగల్లేదు.

ALSO READ:

మణిరత్నం ఇళయరాజా మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం ఇదేనా..!!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. హీరో విశ్వక్ సేన్ కు మరో బంపర్ ఆఫర్..!!

 

Visitors Are Also Reading