Home » ఫిదాలో సాయి పల్లవికి అత్తగా నటించిన ఈమె స్టార్ డైరెక్టర్ తల్లి అని తెలుసా..?

ఫిదాలో సాయి పల్లవికి అత్తగా నటించిన ఈమె స్టార్ డైరెక్టర్ తల్లి అని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫిదా మూవీ.. సాయి పల్లవి హీరోయిన్ గా వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు తెలంగాణ యాస సినిమాల్లో కామెడీ లేదా విలన్ పాత్రలో చూశాం. కానీ ఫిదా సినిమాలో మాత్రం హీరోయిన్ సాయి పల్లవి పాత్ర మొత్తం తెలంగాణలో ఉండటం ఈ సినిమాకు చాలా ప్లస్ గా చెప్పవచ్చు.

 

also read:ద‌స‌రా నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల.. మాస్ లుక్ లో నాని అదుర్స్‌..!

కథ విషయానికి వస్తే తన అన్న పెళ్లి చేయడం కొరకు వచ్చిన కుర్రాడు పెళ్లికూతురు చెళ్లిని చూసి లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఆమెను ఎలా మెప్పించాడు, ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు, అనేది బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథ. కథ ఎంతో సింపుల్ గా ఉన్నా కానీ అందులో లవ్ ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో సాయి పల్లవి డైలాగ్స్ వింటే చాలామందికి అదో రకమైన ఫీలింగ్ వస్తుంది.. తెలంగాణ యాసలో ఎలాంటి భయం లేని పిల్లగా అదరగొట్టే స్తుంది.. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే వేరే లెవెల్..

1. ఇక్కడ భానుమతి హైబ్రిడ్ పిల్ల..
2.ఈ రోడ్లు మాయి గప్చుప్ గా కూర్చో..
3.ఏమ్ ఉన్నాడే..
4.కరెంట్ షాక్ కొడుతది..
5. బరాబర్ వేసుకుంటా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో..

ఇలాంటి డైలాగ్స్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశాయని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ సాయి పల్లవి కాకుండా వరుణ్ తేజ్ కు కూడా మంచి పేరు వచ్చింది.. ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో సాయి పల్లవి అత్త క్యారెక్టర్ లో చేసిన ఆమె ఎవరో మీకు తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లిచూపులు సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ అమ్మ. ఈమె పేరు గీత.. ఈ సినిమాలో గీతా గారు చాలా సింపుల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒక విలేజ్ లో అత్తగారి ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ విధంగా నటించి అందరినీ మెప్పించింది అని చెప్పవచ్చు.

also read:ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేష‌న్ పై ర‌ష్మిక ఇలా ఎందుకు అన్న‌ది..?

Visitors Are Also Reading